Begin typing your search above and press return to search.
అమెరికా వైపే భారత విద్యార్థుల చూపు
By: Tupaki Desk | 17 Nov 2020 11:45 AM ISTఅగ్రరాజ్యం.. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా, ఉద్యోగ అవకాశాలు గల దేశం.. అంత్యంత ఎక్కువ జీతాలు.. ఉద్యోగ భద్రత.. అందుకే భారతీయులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు, వృత్తి విద్యా నిపుణులు, టెకీలు అమెరికాలో అవకాశాల కోసం చకోర పక్షిలా పరిగెడుతూనే ఉంటారు.
రోజులు గడుస్తున్న కొద్దీ అమెరికా ఉన్నత చదువులపై భారతీయుల ఆసక్తి పెరుగుతూనే ఉంది. ప్రతి ఏటా లక్షలసంఖ్యలో భారత విద్యార్థులు అమెరికా పయనమవుతున్నారు.
2019-20 విద్యా సంవత్సరంలో దాదాపు 2 లక్షలమంది భారతీయ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అమెరికాను ఎంచుకున్నట్టు ‘ఓపెన్ డోర్స్ నివేదిక ’ బయటపెట్టింది.తాజాగా ఈ నివేదికను భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం విడుదల చేసింది.
అమెరికాలో ఉన్నత చదువుల కోసం ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షలమంది విద్యార్థులు వివిధ దేశాల నుంచి వెళ్తున్నారు. వీరిలో 20 శాతం మంది భారతీయ విద్యార్థులే ఉన్నారని.. గత కొంతకాలంగా భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు నివేదిక తెలిపింది.
వలసలపై కఠినంగా వ్యవహరించిన ట్రంప్ హయాంలోనూ భారతీయ విద్యార్థులు అమెరికాకు భారీగానే వెళ్లారు. ఇప్పుడు జోబైడెన్ హయాంలో విదేశీయులకు నియంత్రణలు ఎత్తివేస్తానని మాట ఇవ్వడంతో అది మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
అమెరికాకు ఉన్నత చదువుల కోసం వెళుతున్న భారతీయుల సంఖ్య గడిచిన 10 ఏళ్లలో రెట్టింపు అయ్యిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీన్ని బట్టి మనోళ్ల అమెరికా చూపులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
అమెరికాలో ప్రాక్టికల్ అప్లికేషన్, అనుభవంతో కూడిన ఉన్నత విద్యా ప్రమాణాలే విద్యార్థులను అంతర్జాతీయ మార్కెట్ లో ముందు వరుసలో నిలబెడుతున్నాయని అమెరికా రాయబారి తెలిపారు. ఇక అమెరికా విద్య ఎలా ఉంటుందో తమ సలహాల కేంద్రాల ద్వారా విద్యార్థులకు వివరిస్తున్నాయి. భారత్ లోని ఢిల్లీ, బెంగుళూరు, అహ్మదాబాద్, కోల్ కతా, చెన్నై, హైదరాబాద్ లాంటి నగరాల్లో అమెరికాలోని 4500 గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో విద్యావకాశాలు గురించి, విద్యావ్యవస్థపై ఎప్పటికప్పడు సమాచారం తెలుసుకోవచ్చని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది.
ఇలా అమెరికా ఆశలు భారతీయ విద్యార్థుల్లో ప్రతీఏటా పెరుగుతూనే ఉన్నాయి. ఉన్నత విద్యా, అవకాశాల కోసం అమెరికాకు వెళుతున్న వారి సంఖ్య ఏటికేడు పెరుగుతూనే ఉందని గణాంకాలు చెబుతున్నాయి.