Begin typing your search above and press return to search.

రూపాయి విలువ పెరిగింది.. కార‌ణం ఇదే

By:  Tupaki Desk   |   1 Nov 2017 6:15 AM GMT
రూపాయి విలువ పెరిగింది.. కార‌ణం ఇదే
X
రూపాయి బ‌క్క‌చిక్కింది. బ‌ల‌హీన‌ప‌డింది లాంటి వార్త‌ల్నే చూస్తాం త‌ప్ప‌.. బ‌ల‌ప‌డింది.. దూసుకెళుతోంద‌న్న వార్త‌లు చాలా చాలా త‌క్కువ‌గా చూస్తాం. ఇన్నాళ్ల‌కు అలాంటి వార్త చ‌దివే అవ‌కాశం ద‌క్కింద‌ని చెప్పాలి. ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభ‌మైన నాటి నుంచి రూపాయి విలువ భారీగా పెర‌గ‌టం గ‌మ‌నార్హం.

ట్రేడింగ్ ప్రారంభంలోనే డాల‌ర్ తో రూపాయి మార‌కం విలువ ఆరు వారాల గ‌రిష్ఠానికి చేరుకోవ‌టం విశేషం. ఉన్న‌ట్లుండి రూపాయి విలువ అంత పెర‌గ‌టానికి కార‌ణం ఏమిటి? అన్న విష‌యంలోకి వెళితే.. ఆస‌క్తిక‌ర అంశాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి. ప్ర‌పంచ బ్యాంక్ తాజాగా విడుద‌ల చేసిన నివేదిక ప్ర‌భావ‌మే రూపాయి బ‌ల‌ప‌డ‌టానికి కార‌ణం. వ్యాపార అనుకూల దేశాల్లో భార‌త్ ర్యాంకు భారీగా మెరుగుప‌డ‌టం.. ఏడాది వ్య‌వ‌ధిలో 22 స్థానాలు ముందుకు రావ‌టం లాంటి కార‌ణాల‌తో సానుకూల వాతావ‌ర‌ణం నెల‌కొంది.

ఇప్ప‌టివ‌ర‌కూ ఎప్పుడూ లేని రీతిలో ఒక్క ఏడాది వ్య‌వ‌ధిలో 22 ర్యాంకులు మెరుగుప‌డిన దేశం ఏదీ లేదు. అలాంటి ఘ‌న‌త‌ను భార‌త్ సాధించింది. దీంతో.. మార్కెట్ సెంటిమెంట్ అనుకూలంగా మారి.. రూపాయి విలువ పెర‌గ‌టానికి కార‌ణంగా చెప్పొచ్చు.

వ్యాపార సానుకూల‌త విష‌యంలో ర్యాంకు మెరుగుప‌డింద‌న్న ప్ర‌పంచ బ్యాంకు నివేదిక‌తో డాల‌ర్ తో రూపాయి మార‌కం రూ.64.67 వ‌ద్ద మొద‌లై.. త‌క్కువ వ్య‌వ‌ధిలోనే రూ.64.64 గ‌రిష్ఠానికి చేరుకుంది. అంటే.. డాల‌ర్ విలువ త‌గ్గి రూపాయి విలువ పెర‌గ‌టం గ‌మ‌నార్హం.

రూపాయి విలువ పెర‌గ‌టంతో పాటు.. బీఎస్ ఈ బెంచ్ మార్కు సూచీలు సైతం స‌రికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. సెన్సెక్స్ 200 పాయింట్లు పైగా పెర‌గ్గా.. నిఫ్టీ ఆల్ టైం హై 10,400 మార్క్ ను క్రాస్ చేసింది.