Begin typing your search above and press return to search.

మీరు చదివింది కరెక్టే.. అక్కడి కేజీ మట్టి విలువ జస్ట్ 9 బిలియన్ డార్లు

By:  Tupaki Desk   |   6 Jun 2021 10:20 AM GMT
మీరు చదివింది కరెక్టే.. అక్కడి కేజీ మట్టి విలువ జస్ట్ 9 బిలియన్ డార్లు
X
మీరు చదివింది కరెక్టే. అందులో ఏ మాత్రం పొరపాటు లేదు. ఏంటి.. కేజీ మట్టి రూ.6.58 లక్షల కోట్లా? అంటే అవుననే చెప్పాలి. పేపర్ మీద ఈ మొత్తం అంకె వేసి.. ఎంతో చెప్పమంటే కనీసం నిమిషం.. రెండు నిమిషాలకు మించే టైం పడుతుంది. అలాంటిది అంత భారీ మొత్తం.. కేజీ మట్టి విలువ అన్నంతనే మదిలో మెదిలే ప్రశ్న..ఇంతకీ ఆ మట్టి ఎక్కడ దొరుకుతుందని. ఇంత విలువైన మట్టి కోసం ఎవరూ పోటీ పడలేదా? అన్న సందేహం కలుగక మానదు.

అయితే.. ఈ మట్టి భూమీ మీద ఉంటే.. ఏదో ఒకటి చేసి.. లక్షలాది కోట్లు వెనకేసుకోవచ్చు. కానీ.. ఆ మట్టి ఉండేది అంతరిక్షంలో అల్లంత దూరన ఉన్న అంగాకరక గ్రహం మీద మట్టి విలువ అని.. తాజాగా నాసా వెల్లడించింది. అంగారక గ్రహం మీద ఉన్న మట్టిని తీసుకురావటం కోసం వేలాది కోట్లు ఖర్చు పెట్టేందుకు వెనుకాడ లేదు. ఈ సంస్థ పంపిన అంతరిక్ష నౌక ఇప్పటికే అక్కడ పరిశోధనలు మొదలు పెట్టటం తెలిసిందే.

అన్ని అనుకున్నట్లు జరిగి అంగారక గ్రహం మీద ఉన్న మట్టిని భూమి మీదకు రప్పించే వీలు కలిగితే.. ఈ భూమి మీద ఉన్న అత్యంత అపురూపమైన వస్తువుల్లో అంగారక మట్టే అవుతుందని చెబుతున్నారు. అంగారక గ్రహం మీద పరిశోధనలు జరుపుతున్న రోవర్ ను మళ్లీ భూమి మీదకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా అంగారక గ్రహం మీద నుంచి కిలో మట్టిని సేకరించి భూమి మీదకు తీసుకురానున్నారు. ఒకవేళ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే.. ఈ మట్టి కేజీ విలువ తొమ్మిది బిలయన్ డాలర్లుగా లెక్క వేస్తున్నారు.