Begin typing your search above and press return to search.
తెలుగు రాష్ట్రాల సీఎంలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కేంద్రమంత్రి
By: Tupaki Desk | 17 Jan 2021 9:24 AM ISTకేంద్రాన్ని విమర్శలతో బంతాట ఆడుకునే ముఖ్యమంత్రుల్ని చాలామందినే చూశాం. అందుకు భిన్నంగా ఒక్క మాట కూడా తేడాగా మాట్లాడకుండా.. సింఫుల్ మాటలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కేంద్రమంత్రిగా గజేంద్ర సింగ్ షెకావత్ మారారు. తాజాగా ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు ఇద్దరు ముఖ్యమంత్రుల మీద ఒత్తిడిని అంతకంతకూ పెంచుతోంది. అంతేకాదు.. ఎందుకు గొడవ పడ్డాంరా బాబు? అన్నట్లుగా మారింది. ఇంతకూ జరిగిందేమంటే.. రెండు తెలుగురాష్ట్రాలు ఎవరికి వారు పక్క రాష్ట్రం వారు తమ ప్రయోజనాల్ని దెబ్బ తీస్తూ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్లుగా కంప్లైంట్లు ఇవ్వటం తెలిసిందే.
రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ ఎవరికి వారుగా కేంద్రమంత్రి గజేంద్రను కలిసి.. విడివిడిగా కంప్లైంట్లు ఇవ్వటం.. దీని పరిష్కారం కోసం.. రెండు తెలుగు రాష్ట్రాలు నిర్మించిన ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్ లను ఇవ్వాలని కోరటంతో గొంతులో పచ్చి వెలక్కాయ పడిన పరిస్థితి. దాంతో.. ఇద్దరు ముఖ్యమంత్రులు కామ్ గా ఉంటున్నారు. చూస్తూ.. చూస్తూ ప్రాజెక్టు డీపీఆర్ లు కానీ ఇస్తే.. విషయాలన్ని ఇట్టే అర్థం కావటమే కాదు.. బంతాట ఆడుకోవటం ఖాయం. అందుకే.. కేంద్రమంత్రి కోరినప్పటికి సరే అన్న ఇద్దరు ముఖ్యమంత్రులు.. ఆ తర్వాత నుంచి చప్పుడు చేయకుండా ఉండిపోతున్నారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద తనకు వచ్చిన పట్టును గుర్తించిన కేంద్రమంత్రి.. విషయాన్ని వదలకుండా అదే పనిగా.. డీపీఆర్ ల విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. తాజాగా ఇద్దరు ముఖ్యమంత్రులకు ఆయన విడివిడిగా లేఖ రాశారు. అందులో.. తనను విడిగా కలిసిన సీఎంలు.. తమ రాష్ట్రాల ప్రాజెక్టుల డీపీఆర్ లను ఇస్తానని చెప్పారని.. కానీ ఇప్పటివరకూ ఇవ్వలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. డీపీఆర్ లతో పాటు ఇతర సాంకేతిక సమస్యల వివరాల్ని కూడా సమర్పిస్తే.. అంతర్రాష్ట్ర జల వివాదాలు సునాయాసంగా పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. విభజన చట్టం 2014 ప్రకారం ఈ సమస్యల్ని పరిష్కరించుకోవటం అనివార్యమన్నారు.
వివాదాల పరిష్కారం కోసం తెలంగాణ.. ఏపీ రాష్ట్రాలు కేంద్రానికి సమర్పించాలని చెప్పిన కేంద్రమంత్రి.. ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాల్సిన ప్రాజెక్టు డీపీఆర్ లను చూస్తే.. కేంద్రమంత్రి వారి చతురత ఇట్టే అర్థమైపోతుంది.
తెలంగాణలో
- పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం
- ఆర్.విద్యాసాగర్‌రావు డిండి ఎత్తిపోతల పథకం
- భక్త రామదాసు ఎత్తిపోతల పథకం
- వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్స్ అండర్ మిషన్ భగీరథ
- తుమ్మిళ్ల ఇరిగేషన్ స్కీం
- మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం
- జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం
- ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్
- గోదావరి ఎత్తిపోతల పథకం ఫేజ్-3
- సీతారామ ఎత్తిపోతల పథకం
- పీవీఎన్ రావు కంతానపల్లి సుజల స్రవంతి తుపాలకులగూడెం
- తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్
- లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టుపై మూడు బ్యారేజీలు
- వరంగల్ జిల్లాలోని ఇంటర్-బేసిన్ వాటర్ ట్రాన్స్‌ఫర్ ఫ్రం రామప్ప లేక్ టు పాకాల లేక్
- కాళేశ్వరం ప్రాజెక్టు(మూడో టీఎంసీ)