Begin typing your search above and press return to search.

కేసీఆర్ దగ్గర తలసానికి ఉన్న ‘సీన్’ ఎంతో చెప్పే ఉదంతమిది

By:  Tupaki Desk   |   18 Nov 2020 10:15 AM IST
కేసీఆర్ దగ్గర తలసానికి ఉన్న ‘సీన్’ ఎంతో చెప్పే ఉదంతమిది
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు గెలుచచుకోవటం అంత తేలికైన విషయం కాదు. ఆ మాటకు వస్తే.. కేసీఆర్ తో డైలీ బేసిస్ లో కలుస్తూ.. ఏ మాత్రం తేడా రాకుండా చూసుకోవటం కత్తి మీద సాము లాంటిదని చెబుతారు. ఆ విషయంలో మంత్రి తలసాని తర్వాతే ఎవరైనా అని చెబుతారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ తో కలిసి ట్రావెల్ చేసిన వారెవరికి లేనంత చనువు.. మంత్రి తలసానికి ఉందని చెబుతారు. సమయం.. సందర్భంతో పని లేకుండా ప్రగతిభవన్ కు వెళ్లే చనువు మంత్రి తలసానికి మాత్రమే ఉందని చెబుతారు.

ఈ కారణంతోనే కావొచ్చు.. చాలామంది మంత్రులకు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తలసాని అంటే అసూయగా ఫీల్ అవుతారని చెబుతారు. తమకు సీఎం దర్శన భాగ్యమే కష్టమనుకుంటే.. తలసాని మాత్రం అందుకు భిన్నంగా తరచూ ప్రగతిభవన్ కు ఎలా వెళ్లి వస్తారో తమకు అస్సలు అర్థం కాదన్న మాట పలువురు టీఆర్ఎస్ నేతల నోటి నుంచి వినిపిస్తూ ఉంటుంది.

సీఎం కేసీఆర్ వద్ద తలసాని పరపతి ఏ స్థాయిలో ఉందన్న విషయం తాజాగా చోటు చేసుకున్న ఒక ఉదంతం ఇట్టే చెప్పేస్తుందని చెబుతున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న తాజాగా మంత్రితలసానిని ఎమ్మెల్యే క్వార్టర్స లో కలవటం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. సాయన్నకుటుంబం తలసానిని కలవటం.. గ్రేటర్ ఎన్నికల్లో తమ వారి టికెట్ కోసం చేసిన ప్రయత్నం చూసినప్పుడు.. సీఎం కేసీఆర్ వద్ద మంత్రి తలసానికి ఉన్న ఇమేజ్ ఎంతో ఇట్టే తెలియజేస్తుందని చెబుతున్నారు. మరి.. సదరు ఎమ్మెల్యే ఫ్యామిలీ కోరుకున్నట్లే టికెట్ విషయంలో తలసాని ఏం చేస్తారు? ఆయన మాట ఏ మేరకు చెల్లుబాటు అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.