Begin typing your search above and press return to search.

ఎంత ఎక్కువ సేపు ముద్దిస్తే అంత పెద్ద బహుమతి

By:  Tupaki Desk   |   9 July 2020 2:30 AM GMT
ఎంత ఎక్కువ సేపు ముద్దిస్తే అంత పెద్ద బహుమతి
X
ముద్దంటే ఎవరికి చేదు.. కాలం వేగంగా మారుతున్న ఈ సమాజంలో ఇప్పుడు సినిమాల్లో ముద్దు కామన్ అయిపోయింది. కానీ ఇది ఈ కరోనా టైంలో కాదు లెండి? కరోనాకు ముందు జరిగిన సంగతి. ఈ టైంలో ముద్దు అంటే కరోనాను అంటించుకోవడమే. కనీసం దగ్గరకు కూడా రానీయలేని ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అందరికీ భయం వేస్తోంది.

సమాజానికి దూరంగా ఆధునికతకు ఆమడ దూరంలో బతుకీడుస్తున్న గిరిజన ఆదీవాసీల్లో ఉన్న సెక్స్ అపోహలను దూరం చేయాలని ఓ ఎమ్మెల్యే అదిరిపోయే ఆలోచన చేశారు. వారి బిడియాన్ని పొగొట్టాడు.. ఈ సందర్భంగా ప్రతీఏట జార్ఖండ్ రాష్ట్రంలో పెట్టే కిస్సింగ్ కాంపిటీషన్ వార్తల్లో నిలుస్తుంటుంది.

ఆదివాసీలు ఇంకా మూఢనమ్మకాలతో అనవసర భయాలతో మోడ్రన్ జీవితానికి దూరంగా ఉంటుండడంతో జార్ఖండ్ రాష్ట్రంలో ఆదివాసి తెగకు చెందిన ఎమ్మెల్యే నసైమన్ మరాండీ కిస్సింగ్ కాంపీటీషన్ ప్రతీ ఏటా నిర్వహిస్తుంటాడు. ఇది ఎమ్మెల్యే స్వగ్రామమైన తాల్ పహాడీలో జరుగుతుంది. ఎంత ఎక్కువ సేపు ముద్దులిస్తే అంత పెద్ద బహుమతి అని ప్రకటిస్తాడు. ఇదేదో బాగుంది అని ఆ ఊరి గ్రామస్థులందరూ రెచ్చిపోయేవారు. తమ భార్యలను ముద్దిచ్చుకునేందుకు ఎగబడుతుంటారు. ఈ కిస్సింగ్ కాంపీటీషన్ ను జార్ఖండ్ రాష్ట్రంలో ప్రతీ ఏటా నిర్వహిస్తుంటారు.

ఈ కాంపిటీషన్‌లో విశేషమేమంటే ఏ జంట అత్యధిక సమయం ముద్దు పెట్టుకుంటుందో వారిని విజేతగా ప్రకటిస్తారు. ఈ విధంగా ఎంపికైన మూడు జంటలకు బహుమతులు అందజేస్తారు. బహుమతులు భారీగా ఇస్తామని ప్రకటించడంతో ఆ ఆదివాసీలందరూ ముందూ వెనుకా చూడకుండా తమ భార్యలను ముద్దులతో చంపేస్తుంటారు. ఎక్కువ సేపు ముద్దు పెట్టుకున్న ముగ్గురిని విజేతలుగా నిర్ణయించి బహుమతులు అందజేస్తాడు ఆ ఎమ్మెల్యే..

అయితే ప్రతీ ఏటా జరిగే ఈ ముద్దుల పోటీ ఈసారి కరోనా కారణంగా జరగకపోయేసరికి ఆ ముద్దు వీరులంతా సోషల్ మీడియాలో తెగ బాధపడిపోతున్నారు. ఈ పాడు కరోనా చేయబట్టి తమకు ముద్దుల పోటీ జరగలేదని.. బహుమతులు అందడం లేదని ఆ రాష్ట్రంలో ఆదివాసీలు తెగ బాధపడిపోతున్నారట..ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది. కరోనా కాటుకు ఇలాంటి అరుదైన పండుగలు కనుమరుగైపోయిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది.