Begin typing your search above and press return to search.

ఆ సీఎం ఇంటిని పేల్చేస్తామంటూ బెదిరింపు కాల్.. ఫోన్ చేసిందెవరంటే?

By:  Tupaki Desk   |   23 May 2021 7:32 AM GMT
ఆ సీఎం ఇంటిని పేల్చేస్తామంటూ బెదిరింపు కాల్.. ఫోన్ చేసిందెవరంటే?
X
సంచలన నిర్ణయాలతో దేశ వ్యాప్తంగా చర్చగా మారారు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్. అలాంటి ఆయనకు సంబంధించిన షాకింగ్ కాల్ ఒకటి వచ్చింది. బాంబుతో సీఎం నివాసాన్ని బాంబుతో పేల్చేస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్ రావటంతో ఫుల్ అలెర్టు అయ్యారు. ఎగ్మూరులోని పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసిన వ్యక్తి ఒకరు.. ఆళ్వార్ పేటలోని చిత్తరంజన్ వీధిలో ఉన్న సీఎం ఇంట్లో బాంబు పెట్టామని.. మరికాసేపట్లో పేలుస్తామని చెప్పి ఫోన్ కట్ చేశారు.

దీంతో అప్రమత్తమైన పోలీసులు... బాంబ్ స్వ్కాడ్ నిపుణులు.. పోలీసు జాగిలాలతో సీఎం ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటి పరిసరాలు మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించి.. వచ్చిన బెదిరింపు కాల్ ఫేక్ గా తేల్చారు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఫోన్ కాల్ ఎక్కడ నుంచి వచ్చిందన్న విషయంపై ఆరా తీశారు. చివరకు విల్లుపురం జిల్లా మరక్కాణంకు చెందిన 26 ఏళ్ల భువనేశ్వర్ అనే మతిస్థిమితం లేని వ్యక్తి ఈ ఫోన్ చేసినట్లుగా తేల్చారు.

గతంలోనూ ఇతగాడు ముఖ్యమంత్రి పళనిస్వామితో పాటు.. పుదుచ్చేరి ముఖ్యమంత్రి.. ప్రముఖ సినీ నటులు రజనీ.. విజయ్.. అజిత్ తదితరుల ఇంట్లో బాంబులు పెట్టినట్లుగా ఫోన్ చేసి బెదిరించినట్లుగా గుర్తించారు. మరోసారి ఇలాంటి తప్ప చూస్తే.. శిక్ష తప్పదని.. మతిస్థిమితం లేని నేపథ్యంలో వదిలేస్తున్నట్లుగా చెప్పిన పోలీసులు భువనేశ్వర్ కుటుంబ సభ్యులను హెచ్చరించి వదిలేశారు.