Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ వచ్చిందన్న సంతోషం కంటే టెన్షనే పెరిగిందే

By:  Tupaki Desk   |   10 Dec 2020 5:00 PM IST
వ్యాక్సిన్ వచ్చిందన్న సంతోషం కంటే టెన్షనే పెరిగిందే
X
కరోనాతో విలవిలలాడుతున్న వారికి ఇప్పుడో విచిత్రమైన పరిస్థితి. మొన్నటివరకు ఎప్పుడెప్పుడు కరోనా వచ్చి పడుతుందో అన్న భయాందోళనలు వ్యక్తమైతే.. తాజాగా వ్యాక్సిన్ వచ్చిందన్న సంతోషం లేని పరిస్థితి. సాధారణంగా ఒక వ్యాక్సిన్ తయారీకి కనీసం ఐదేళ్లు.. కొన్ని సందర్భాల్లో పదేళ్లు కూడా పడుతుంది. వ్యాక్సిన్ అనేది సంక్లిష్టతతో కూడుకున్న పని. ఎందుకంటే.. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల మనుషులకు ఓకే అయిన వ్యాక్సిన్ రూపొందించటం అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే.. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయి.

అందరికి సూట్ అయ్యేలా వ్యాక్సిన్ రూపొందించటం.. వాటిని పెద్ద ఎత్తున ట్రయల్స్ నిర్వహించిన తర్వాతే ప్రజలకు ఇవ్వాల్సి ఉంటుంది. కరోనా లాంటి ప్రత్యేక పరిస్థితుల కారణంగా వ్యాక్సిన్ ను యుద్ధ ప్రాతిపదికన రూపొందించారు. బ్రిటన్ లో ఇప్పటికే వ్యాక్సిన్ ప్రజలకు వేస్తున్నారు. మన దేశంలోనూ వచ్చే ఏడాది జనవరి 15 తర్వాత నుంచి సాధారణ ప్రజలకు వ్యాక్సినేషన్ చేసే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి.

బ్రిటన్ లో వేస్తున్న వ్యాక్సిన్ అక్కడక్కడా సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తున్నాయి. అయితే.. తీవ్రమైన అంశాలు ఇప్పటివరకు రికార్డు కాలేదు. కొన్ని ప్రత్యేక వ్యాధులు ఉన్న వారికి వ్యాక్సిన్ సూట్ కాదని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా యూఎస్ ఎఫ్ డీఏ సంచలన అంశాల్ని బయటపెట్టింది. దీని ప్రకారం క్లినికల్ ట్రయల్స్ లో వ్యాక్సిన్ తీసుకున్న నలుగురు వాంటీర్లలో తాత్కాలిక ముఖ పక్షవాతానికి గురైనట్లుగా పేర్కొంది. ఫైజర్ వ్యాక్సిన్ వినియోగించినప్పుడు ఇలాంటి ఇబ్బందిని ఎదుర్కొన్నట్లుగా పేర్కొంది. అదే సమయంలో మిగిలిన వారిలో ఎలాంటి సైడ్ ఎఫెక్టులు బయటపడలేదని చెప్పింది. టీకాతో ఏర్పడే సమస్యలపై మరింత విస్తృతంగా పర్యవేక్షించాలని పేర్కొంది. దీంతో.. వ్యాక్సిన్ వచ్చిందన్న సంతోషం కంటే.. వాడితే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయన్న టెన్షన్ ఎక్కువైనట్లుగా చెప్పాలి.

ఫైజర్ టీకా ట్రయల్స్ లో పాల్గొన్న వాలంటీర్లలో 84 శాతం మంది ఏదో ఒక రియాక్షన్ కు గురైనట్లుగా తెలుస్తోంది. టీకా తీసుకున్న తర్వాత 63 శాతం మందికి అలటస.. ఆయాసం వస్తే.. 55 శాతం మందికి తలనొప్పి వచ్చినట్లుగా తెలిపారు. అంతేకాదు.. టీకా వాడిన వెంటనే 32 శాతం మందికి చలి వేసిందని.. 24 శాతం మందికి కీళ్లనొప్పులు.. 14 శాతం మంది జ్వరంతో బాధ పడ్డారు. అయితే.. ఇవన్నీస్వల్ప దుష్పలితాలే తప్పించి సీరియస్ కావని చెబుతున్నారు. ఇదంతా చదివిన తర్వాత మాత్రం.. వ్యాక్సిన్ వచ్చిందన్న సంతోషం కంటే.. .కొత్త టెన్షన్ పట్టుకోవటం ఖాయం.