Begin typing your search above and press return to search.

సీనియర్ ఐపీఎస్ కు షాకిచ్చిన తెలంగాణ సర్కార్

By:  Tupaki Desk   |   7 Oct 2020 5:30 PM GMT
సీనియర్ ఐపీఎస్ కు షాకిచ్చిన తెలంగాణ సర్కార్
X
పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా పనిచేసిన సీరియర్ ఐపీఎస్ అధికారి వీకేసింగ్ కు తెలంగాణ సర్కార్ షాకిచ్చింది. ఆయన పెట్టుకున్న వాలంటరీ రిటైర్ మెంట్ ను తెలంగాణ సర్కార్ తిరస్కరించింది. గాంధీ జయంతి రోజున తనకు వీఆర్ఎస్ ఇవ్వాల్సిందిగా ఆయన పెట్టుకున్న ఫైల్ ను తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

కొంతకాలంగా తెలంగాణ సర్కార్ పై వీకేసింగ్ తీవ్రంగా మండిపడుతున్నారు. తనకు మంచి పోస్టింగ్ ఇవ్వడం లేదని.. ప్రాధాన్యత కల్పించడం లేదని ప్రభుత్వానికే నేరుగా లేఖలు అప్పట్లో రాసి సంచలనం సృష్టించారు. మొదటి నుంచి సంచలనాలకు కేరాఫ్ గా వీకేసింగ్ ఉన్నారు. జైళ్ల శాఖలో సంస్కరణలు అమలు చేసి పాపులర్ అయ్యారు. కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు. పోలీస్ అకాడమీ డైరెక్ట్ గా ఉంటూ తెలంగాణ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇక జైళ్ల శాఖ నుంచి ఆయనను మార్చి ప్రింటింగ్ విభాగానికి బదిలీ చేసినా ఆయన నోరుపారేసుకోవడం ఆపలేదు. ఇక ఆ తర్వాత పోలీస్ శిక్షణ కేంద్రం డైరెక్టర్ గా నియమించారు. మీడియాపై కూడా నోరుజారి కేసులు పెట్టారు వీకేసింగ్.

అదనపు డీజీగా ఉన్న తనకు డీజీగా ఎందుకు పదోన్నతి ఇవ్వడం లేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాను పదోన్నతికి పనికిరానా అని విమర్శించారు. తాను ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేస్తానని.. వాలంటరీ రిటైర్ మెంట్ ఇవ్వాలని ప్రభుత్వానికి ఘాటు లేఖ రాశారు.

వీకే సింగ్ విమర్శలకు ధీటుగా తెలంగాణ సర్కార్ ఆయనపై సీరియస్ యాక్షన్ తీసుకోనున్నట్టు సమాచారం. అక్రమ కలప స్మగ్లింగ్ విచారణ చేపట్టి వీకేసింగ్ పాత్ర తేలుస్తున్నారని అధికార వర్గాల్లో ప్రచారం సాగుతోంది. వీకేసింగ్ పై రెండు కేసుల్లో శాఖపరమైన దర్యాప్తు సాగుతోందని.. ఆయన వీఆర్ఎస్ ను రద్దు చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.