Begin typing your search above and press return to search.

ముస్లిం చట్టానికి వ్యతిరేకమని తలలు కోసేస్తున్న తాలిబన్లు..!!

By:  Tupaki Desk   |   6 Jan 2022 3:02 AM GMT
ముస్లిం చట్టానికి వ్యతిరేకమని తలలు కోసేస్తున్న తాలిబన్లు..!!
X
ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ దేశ ప్రజలకు వాక్ స్వాతంత్య్రం అనేది లేకుండా పోయింది. ఏమైనా మాట్లాడితే అనవసరంగా లేని పోనీ తిప్పాలను ఎదుర్కోవలసి వస్తుందని భావిస్తున్నారు. దానికి బదులు ఏమి మాట్లాడకుండా ఉండడం ఉత్తమం అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో తాలిబన్లు వారికి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు.

వీరు పాలన నుంచి ఎప్పుడు బయటపడదామ అని చాలా మంది చూస్తున్నారు. దీనికి ప్రధాన కారణం వారు చేసే అకృత్యాలు. ప్రత్యేకించి తాలిబన్లు మహిళల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే స్త్రీల విద్య విషయంలో ఆంక్షలు విధించిన తాలిబన్లు తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు.


ఆఫ్ఘనిస్తాన్ లో ఉండే మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా తాలిబన్ల ఆకృత్యాలు ఉన్నాయి. ఇటీవల తాలిబన్లు తీసుకున్నా నిర్ణయం అంతర్జాతీయ సమాజాన్ని విస్మయానికి గురిచేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ లో ఉండే బట్టల షాపుల్లో ప్రత్యేక ఆకర్షణకు ఉంచిన బొమ్మల తలలు తీసి వేయాలంటూ తాలిబన్ల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది . ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో బట్టల షాపులో ఉండే ప్లాస్టిక్ బొమ్మల తలలను కోసి వేశారు.

అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. దేశంలో మహిళలకే కాకుండా వారి బొమ్మలకు కూడా తాలిబన్ ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయిందని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఇదొక అనాగరిక చర్య అని తప్పు పడుతున్నారు. ఇప్పటికైనా తాలిబన్లు ఇలాంటి తలతిక్క పనులను మానుకోవాలని సూచిస్తున్నారు.

తాలిబన్లు 2021 ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్ వారి కైవసం చేసుకున్నారు. వారు అధికార పీఠం ఎక్కిన అప్పటి నుంచి ప్రజల స్వేచ్ఛకు భంగం వాటిల్లే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆడవారి ఈ విషయంలో మీరు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే బట్టల షాపులో ఉండే ప్లాస్టిక్ బొమ్మల తల లను కోసి వేసినట్లు తెలుస్తోంది.

తాలిబన్లు చెబుతున్న దాని ప్రకారం బట్టల షాప్ లో ఉండే బొమ్మలు కూడా ముస్లిం లకు సంబంధించిన షరియా చట్టానికి వ్యతిరేకమని వారు చెప్తున్నారు. ఈ కారణంగానే బొమ్మల తలలను కోసి వేసినట్లు పేర్కొన్నారు. షరియా చట్టానికి వ్యతిరేకంగా ఉండే వాటిలో వేటిని కూడా తాము ఆమోదించమని ఈ మేరకు స్పష్టం చేశారు. ఇకపై బట్టల షాపులో ఉండే ప్లాస్టిక్ బొమ్మలకు తలలో లేకుండానే ప్రదర్శించాలని ఉత్తర్వులు జారీ చేశారు.