Begin typing your search above and press return to search.
ఆ మూడు ఆలయాల్లో ప్రార్థనలు చేసుకోవచ్చు : సుప్రీం !
By: Tupaki Desk | 21 Aug 2020 9:44 PM ISTదేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నసమయంలో జైనులకు సుప్రీంకోర్టు శుక్రవారం శుభవార్త చెప్పింది. మహారాష్ట్ర రాజధాని ముంబై మహానగరంలో మూడు జైన దేవాలయాల్లో పరయూషన ప్రార్థనలు నిర్వహించుకోవడానికి సుప్రీంకోర్టు జైనులకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీచేసింది. అయితే, భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరైయ్యే అవకాశం ఎక్కువగా ఉండటంతో కరోనా మహమ్మారి నిబంధనలు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని సీజేఐ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ముంబయిలోని దాదర్, బైకుల్లా, చెంబూర్ లోని జైన ఆలయాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు, మిగిలిన దేవాలయాల్లోకి అనుమతి లేదని సుప్రీం స్పష్టం చేసింది.
ప్రభుత్వం ఆర్థిక కార్యకలాపాలకు అనుమతించి దేవాలయాల్లో ప్రార్థనలకు మాత్రం కరోనా వ్యాప్తి జరుగుతుందని చెప్తూ అనుమతినివ్వకపోవడం ఆశ్చర్యకరమని ధర్మాసనం అభిప్రాయపడటం గమనార్హం. ఈ నెల 15 నుంచి 23 వరకు మహారాష్ట్రలో జైన దేవాలయాల్లో పరయూషన పూజలకు అనుమతివ్వాలని బాంబే హైకోర్టులో పిల్ వేయగా, ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని భావించడం లేదని ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, మూడు జైన దేవాలయాల్లో ప్రార్థనకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.