Begin typing your search above and press return to search.

సుప్రీం - హైకోర్టు లో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట...!

By:  Tupaki Desk   |   17 July 2020 11:30 AM GMT
సుప్రీం - హైకోర్టు లో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట...!
X
తెలంగాణ సచివాలయం కూల్చివేత పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జూన్ 29న సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌ ను శుక్రవారం విచారించిన సుప్రీం .. కేబినెట్ నిర్ణయాన్ని తప్పుబట్టలేమని స్పష్టం చేసింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్.కె కౌల్, జస్టిస్ ఎం.ఆర్ షాతో కూడిన ధర్మాసనం కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పిటిషన్‌ ను కొట్టి వేసింది. సుప్రీం తీర్పు ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించిందని భావిస్తున్నారు

అలాగే , తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కూల్చివేతలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌లను న్యాయస్థానం తోసిపుచ్చింది. సచివాలయ భవనాల కూల్చివేతకు కేంద్ర అనుమతులు అవసరం లేదని అసిస్టెంట్ సోలిసీటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. కేవలం నూతన నిర్మాణాలు చేపట్టడానికి మాత్రమే అనుమతులు అవసరమని స్పష్టం చేశారు.

ఇప్పటికే సచివాలయ భవనాల కూల్చివేత సగం పూర్తయ్యింది. ఇప్పుడు హైకోర్టు, సుప్రీం కోర్టులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మరికొద్ది రోజుల్లో సచివాలయ భవనాలను కూల్చివేత పూర్తి కానుంది. సచివాలయ భవనాల కూల్చివేత ప్రక్రియ దాదాపు 50శాతానికిపైగా పూర్తయ్యింది. తాజాగా హైకోర్టు కూల్చివేతలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో. ఈ పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. కొద్దిరోజుల్లోనే ఈ భనవాల కూల్చివేత ప్రక్రియను కూల్చివేసి కొత్త సచివాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది.