Begin typing your search above and press return to search.
బ్రిటన్ వాసుల్లో దడ పుట్టిస్తున్న 'స్ట్రెయిన్ వైరస్' !
By: Tupaki Desk | 1 Jan 2021 1:02 PM ISTబ్రిటన్ లో కొత్త ఏడాదికి ఆహ్వానం పలుకుతున్న సమయంలో కొత్త కరోనా స్ట్రెయిన్ వైరస్ విజృంభణ పెరిగిపోతుంది. కొత్త సంవత్సరం రోజున కూడా బ్రిటన్ వాసులు ఆంక్షల మధ్య ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బ్రతుకుతున్నారు. గత నెలరోజుల్లోనే రికార్డు స్థాయిలో నమోదైన కేసులు, మరణాలుఆందోళనకి గురిచేస్తున్నాయి. కరోనా వైరస్ ఉధృతరూపం దాలుస్తోందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ నిబంధనల్ని పాటించాలని బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ హెచ్చరించారు. కేసుల తీవ్రత ఆధారంగా నాలుగు భాగాలుగా విభజించి వివిధ రకాలుగా ఆంక్షల్ని ప్రవేశపెట్టారు.
ఇకపోతే , కరోనా పాజిటివ్ కేసులు ఓ మాదిరిగా ఉంటే టైర్–1 అని, ఎక్కువ ఉంటే టైర్–2, అత్యధికంగా ఉంటే టైర్–3 అని పిలుస్తారు. ఇక టైర్–4లో ఉన్న ప్రాంతాల్లోని వారు అత్యవసరమైతే తప్ప ఇల్లు దాటి బయటకు రాకూడదు. నిత్యావసరాలు మినహా మిగతా మార్కెట్ అంతా మూసేశారు. అయితే ,గత కొన్ని రోజులుగా అక్కడ టైర్–4 ప్రాంతాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి మార్కెట్లన్నీ మూసివేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. టైర్–4లో ఉన్న ప్రాంతాల్లో ఆంక్షలు ఏప్రిల్ వరకు కొనసాగుతాయి. కేసుల సంఖ్య ఇలాగే కొనసాగితే దేశమంతటా లాక్‌డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయి.
యూకే వ్యాప్తంగా మొదటి వేవ్ తో పోల్చి చూస్తే 11శాతం ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి. రికార్డు స్థాయిలో బుధవారం 50 వేలకు పైగా కేసులు నమోదు కాగా, గురువారం మరిన్ని పెరిగి కొత్తగా 55,892 కేసులు వచ్చాయి. మొత్తం కేసులు 24,88,780కు, మొత్తం మరణాలు 73,512కు చేరుకున్నాయి. వేల్స్ లో కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. ప్రతీ 60 మందిలో ఒకరికి వైరస్ సో కింది. వేల్స్ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. స్కాట్‌లాండ్‌లో టైర్–4లో ఉండడంతో కర్ఫ్యూ వాతావరణం నెలకొని ఉంది. స్కాట్‌ల్యాండ్ నుంచి యూకేలో ఇతర ప్రాంతాలైన ఇంగ్లండ్, వేల్స్,ఐర్లాండ్‌లకు రాకపోకలపై నిషేధం విధించారు. ఆస్ట్రాజెనెకా కంపెనీ ఈ ఏడాది చివరి నాటికి 40 లక్షల వ్యాక్సిన్‌లు తయారు చేసి అందిస్తామన్న హామీ ఇచ్చింది. అయితే టీకా డోసులు తయారైనప్పటికీ వాటి నాణ్యతని పరీక్షించి విడుదల చేయడానికి సమయం పడుతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. మరోవైపు వ్యాక్సిన్ వచ్చినంత మాత్రాన సాధారణ పరిస్థితులు వస్తాయని అనుకోవద్దని, ప్రతీ వ్యక్తి కరోనా జాగ్రత్తలు పాటించాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు