Begin typing your search above and press return to search.

సవతి తల్లి కర్కషం.. దీప్తి ని చంపి కాలువ లో పడేసింది

By:  Tupaki Desk   |   25 Nov 2019 3:48 PM IST
సవతి తల్లి కర్కషం.. దీప్తి ని చంపి కాలువ లో పడేసింది
X
సవతి తల్లే ఆ చిన్నారి పాలిట యమ పాశమైంది. ఏడేళ్ల ఆ చిన్నారిని కర్కషంగా చంపేసింది. ఓ సంచిలో మూటగట్టి అతికిరాతకంగా ఓ ఏరులో పడేసింది. మానవత్వం మంటగలిసేలా చేసిన ఆ సవతి తల్లి కర్కషం అందరినీ షాక్ కు గురిచేసింది.. చిన్నారి మరణం తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపింది.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కిడ్నాప్ అయిన ఏడేళ్ల చిన్నారి మిస్టరీ వీడింది. ఇంద్రపాలెం గేట్ల వద్ద చిన్నారి దీప్తి శ్రీ మృతదేహాన్ని ధర్మాడి సత్యం బృందం సోమవారం గుర్తించింది.

మూడు రోజుల క్రితం పాఠశాల నుంచి దీప్తిశ్రీ అదృష్యమైంది. అప్పటి నుంచి పాప ఆచూకీ కోసం పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. ఈ కేసు లో ప్రధాన ఆరోపణలు చిన్నారి సవతితల్లి శాంతకుమారి పై వచ్చాయి. దీప్తిశ్రీ అమ్మమ్మ తన మనవరాలిని శాంతకుమారినే చంపిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో శాంతకుమారిని విచారించగా తనే చంపి ఓ సంచిలో మూటగట్టి కాలువ లో పడేసినట్టు నేరాన్ని ఒప్పుకుంది. ధర్మాడి సత్యం బృందం చిన్నారి మృతదేహాన్ని కాలువ నుంచి వెలికితీసింది.

దీప్తి శ్రీ సవతి తల్లికి ఇటీవలే బాబు జన్మించాడు. తన కుటుంబానికి దీప్తి శ్రీ అడ్డు అని భావించిన శాంతకుమారి చిన్నారిని స్కూల్లో నుంచి ఇంటికి తీసుకొచ్చి అతి కిరాతకంగా చంపింది. అనంతరం సంచిలో దీప్తిశ్రీ మృత దేహాన్ని మూటగట్టి కాలువ లో పడేసింది. చిన్నారిని చంపింది సవతితల్లేనని పోలీసులు తేల్చారు. చిన్నారి మృత దేహాన్ని కనుగొన్నారు.