Begin typing your search above and press return to search.
ఆ మాస్కుల్ని బ్యాన్ చేసిన రాష్ట్ర సర్కార్
By: Tupaki Desk | 15 Aug 2020 10:45 AM ISTకరోనా వేళ.. మాస్కుల్ని ధరించటం తప్పనిసరి చేయటం తెలిసిందే. మాస్కులు ధరించకుండా బయటకు వచ్చే వారిపై జరిమానాలు విధించటం ఇప్పటివరకు చూశాం. తాజాగా మరో అడుగు ముందుకు పడింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర సర్కారు మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. కొన్ని రకాల మాస్కుల్ని నిషేధాన్ని విధించటమే కాదు.. సదరు మాస్కుల్ని ధరిస్తే వంద రూపాయిల జరిమానాను విధిస్తున్నట్లుగా పేర్కొన్నారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెల్లడయ్యాయి.
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ అధికారులు రోటీన్ కు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కరోనా వ్యాప్తికి చెక్ పెట్టేందుకు వీలుగా మాస్కుల్ని ధరించటం తెలిసిందే. అయితే.. ఈ మాస్కుల్లో ఎన్ 95, వాల్వ్ ఉన్న మాస్కుల్ని వాడితే ప్రమాదకరమని.. వీటి ద్వారా వైరస్ సోకే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అందుకే.. ఎన్ 95తో పాటు.. వాల్వ్ ఉన్న మాస్కుల్ని ధరించకూడదన్న నిర్ణయాన్ని అధికారికంగా తీసుకున్నారు.
బహిరంగ ప్రదేశాల్లో ఎన్ 95 మాస్కులతో పాటు.. వాల్వ్ ఉన్న మాస్కులు వాడొద్దని చెబుతున్నారు. తాము జారీ చేసిన ఆదేశాల్ని ఉల్లంఘిస్తూ బహిరంగ ప్రదేశాల్లో ఈ మాస్కుల్ని వాడితే వంద రూపాయిలు జరిమానా విధించనున్నట్లు స్పస్టం చేస్తున్నారు. ఎన్ 95 మాస్కుల్ని వాడటం వల్ల కట్టడి చేయటం కష్టంగా మారిందన్న మాట వినిపించటమే కాదు.. కేంద్రంజారీ చేసిన గైడ్ లైన్స్ కు అనుగుణంగా తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. మరి.. మిగిలిన రాష్ట్రాల ఈ నిర్ణయాన్ని ఎప్పటికి అమలు చేస్తాయో?