Begin typing your search above and press return to search.

ఆ సంచలన పోర్న్ స్టార్ ను చంపేసిన సోషల్ మీడియా

By:  Tupaki Desk   |   1 Feb 2022 4:30 AM GMT
ఆ సంచలన పోర్న్ స్టార్ ను చంపేసిన సోషల్ మీడియా
X
గతంలో అత్యుత్సాహంతో వ్యవహరించే న్యూస్ చానళ్లు పుణ్యమా అని ప్రముఖులు.. సెలబ్రిటీలు చచ్చిపోతుండేవారు. అందరికంటే ముందు ఉండాలన్న అతితో చనిపోకున్నా.. చనిపోయినట్లుగా వార్తలు వేసేసి.. ప్రముఖుల సంతాపాల్ని సైతం పోటాపోటీగా ప్లే చేసేవారు. చానళ్లకు అతికి వెయ్యి రెట్లు ఎక్కువగా ఉండే సోషల్ మీడియా ఎంట్రీతో ఇప్పుడు సీన్ మారింది.

తమకు ఎవరైనా ప్రముఖులు నచ్చకుంటే చాలు.. వారు చచ్చిపోయినట్లుగా న్యూస్ ను వైరల్ చేయటం.. ఒకలాంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటం.. ఇంతకూ సదరు సెలబ్రిటీ మరణించారా? లేదా? అంటూ క్రాస్ చెక్ చేసుకోవాల్సిన దుస్థితి.

తాజాగా అలాంటి పరిస్థితే సంచలన స్టార్ పోర్న్ స్టార్ మియా ఖలీఫా విషయంలోనూ చోటు చేసుకుంది. తక్కువ వ్యవధిలోనే ప్రముఖ పోర్న్ స్టార్ గా ఎదిగిన ఆమె.. ఆ తర్వాత దానికి దూరమైనా.. ఇప్పటికి ఆమె వీడియోలు ఎంతలా పాపులర్ అన్నది ఆ ఇండస్ట్రీకి చెందిన వారు చెప్పే వివరాల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. తన వీడియోలతో కాసుల వర్షాన్ని ఆమె నిర్మాతలు కురిపించుకున్నా.. ఆమెకు మాత్రం పెద్దగా దక్కింది లేదు. ఇదే విషయాన్ని తన ఇంటర్వ్యూలో ఓపెన్ గా చెప్పటానికి ఎలాంటి మొహమాటానికి గురి కాదు మియా ఖలీఫా.

తాజాగా ఆమె మరణించినట్లుగా రూమర్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నాయి. ఆమె వయసు కారణంగా మరణించే అవకాశం లేకున్నా.. ఇప్పుడున్నా కరోనా కాలంలో ఎప్పుడైనా ఎవరి విషయంలో అయినా ఏమైనా జరిగే వీలు ఉండటంతో.. మియామీ మరణ వార్తతో ఉలిక్కిపడి.. క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. తన గురించి..తన యోగక్షేమాల గురించి వెతుకుతున్న వారికి ఒక స్పష్టత ఇచ్చేందుకు మియామీ స్వయంగా రంగంలోకి దిగారు.

ఒక కామెడీ మీమ్ ద్వారా ఒక పోస్టు చేశారు. అందులో ‘చనిపోయిన వారిని తీసుకురండి’ అంటే.. ‘నేను ఇంకా చావలేదు. నేను బాగానే ఉన్నా’ అంటూ ఎటకారం వ్యాఖ్యతో మియామీ ఒక మీమ్ ను తన అధికారిక సోషల్ మీడియా పేజీలో పోస్టు చేశారు. దీంతో.. ఆమె చనిపోయిందంటూ సాగుతున్న రూమర్ అర్థం లేనిదన్న విషయాన్ని తేల్చేశారు. మొత్తానికి సోషల్ మీడియా చంపేసిన మియామీ తన ఎటకారంతో తాను బతికే ఉన్నానన్న విషయాన్ని లోకానికి చెప్పేశారు.