Begin typing your search above and press return to search.
సెంటిమెంట్ కోసమే.. అలా చేశారా... వైసీపీలో గుసగుస
By: Tupaki Desk | 30 Sept 2021 9:00 AM ISTఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం తను ప్రవేశ పెడుతున్న పథకాలు.. చేస్తున్న సంక్షేమాన్ని నమ్ముకుని ముందుకు సాగింది. అందుకే ఎక్కడ ఎన్నికలు వచ్చినా.. సెంటిమెంటుకు ప్రాధాన్యం ఇవ్వకుండా.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలుల.. జగన్ ఇమేజ్.. సంక్షేమం వంటి వాటిని పెద్దగా హైలెట్ చేస్తున్నారు. దీని ద్వారానే నేతలను గెలిపించుకుంటున్నారు. ఇదే ఫార్ములాను .. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలనూ ప్లే చేశారు. ఇక్కడ సక్సెస్ అయ్యారు. అయితే.. గెలిచినా.. ముందుగా నిర్ణయించుకున్న ఐదు లక్షల మెజారిటీ మాత్రం రాలేదు.
దీనికి ప్రతిపక్షాల యాంటీ ప్రచారం కావొచ్చు.. లేదా.. అభ్యర్థిని మార్చడం వల్ల కావొచ్చు.. మొత్తానికి తిరుపతిపై పెట్టుకున్న అంచనాలు మాత్రం సక్సెస్ కాలేదు. అభ్యర్థి గెలిచినా.. అనుకున్నది సాధించలేక పోయారు. జగన్ సైతం తిరుపతి మెజార్టీ విషయంలో అసంతృప్తితోనే ఉన్నారని వైసీపీ వర్గాలే చెప్పాయి. కానీ, ఇప్పడు.. కడప జిల్లా బద్వేల్‌పై ఎవరూ ఎలాంటి టార్గట్ ప్రకటించలేదు. మేం అంత మెజారిటీ సాధిస్తాం.. ఇంత మెజారిటీ సాధిస్తాం.. అని ప్రకటించలేదు.
కానీ, మనసులో మాత్రంలో అంతర్గతంగా ఇచ్చిన ఆదేశాల మేరకు లక్ష మెజారిటీ సాధించాలని అనుకుంటున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుపతి ఉప ఎన్నిక జరిగితే ఆ పార్టీకి లక్ష ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇప్పుడు వైసీపీది కూడా బద్వేల్లో అదే టార్గెట్.. ! అయితే.. పథకాలు.. సంక్షేమం ప్రచారం వల్లే.. ఈ మొత్తం సాధించలేమని.. వైసీపీ నాయకులు.. భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే సెంటిమెంటుకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఇక్కడ నుంచి గత 2019 ఎన్నికల్లో విజయం సాధించిన వెంకట సుబ్బయ్య కుటుంబం నుంచి ఆయన సతీమణిని ఎంపిక చేయడం వెనుక సెంటిమెంటును నమ్ముకున్నట్టుగా ఉందని చెబుతున్నారు.
ఒకవైపు సంక్షేమం, పథకాలను ప్రచారం చేస్తూనే.. మరోవైపు సెంటిమెంటుతో ఇక్కడ ప్రజలను ఆకర్షించాలనే వ్యూహంతో వైసీపీ ముందుకు సాగాలని నిర్ణయించుకుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే నిజమైతే.. వచ్చే ఎన్నికల నాటికి.. మరింతగా కష్టపడాల్సి ఉంటుందని.., సంక్షేమం, పథకాలు.. గెలిపించే పరిస్థితి ఉండదని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.