Begin typing your search above and press return to search.
కేసీఆర్ ఒక్కసారి రంగంలోకి దిగితే సీన్ ఇలానే ఉంటుంది
By: Tupaki Desk | 1 Jan 2021 4:12 AM GMTచాలామంది ముఖ్యమంత్రులకు భిన్నంగా ఉంటుంది తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనా విధానం. కొన్నిరోజుల పాటు స్తబ్దుగా ఉండినట్లుగా ఉండే పాలనా రథం.. ఒక్కసారిగా వాయువేగంతో దూసుకెళుతుంటుంది. ఏదైనా ఇష్యూ మీద కేసీఆర్ ఫోకస్ చేస్తే.. గంటల తరబడి అదే అంశాన్ని చర్చించటమే కాదు.. పెద్ద ఎత్తున నిర్ణయాలు వడివడిగా తీసుకుంటారు. అయితే.. అందుకు ఎంత సమయం పడుతుందన్నదే అసలు సమస్య. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమిటన్న విషయంపై తాజాగా జిల్లా కలెక్టర్లతో సమావేశాన్ని నిర్వహించటం తెలిసిందే.
ధరణి వెబ్ పోర్టల్ అందుబాటులోకి వచ్చిన ఎన్నిరోజులు అయ్యిందో తెలిసిందే. పోర్టల్ షురూ అయిన తర్వాత నుంచి చాలానే సమస్యలు తలెత్తుతున్నాయి. ఇన్నిరోజుల పాటు.. వాటిపై స్పందించని కేసీఆర్.. తాజాగా ప్రగతిభవన్ లో రివ్యూ పెట్టారు. గంటల తరబడి.. ఈ ఇష్యూపై మథనం చేయటంతో పాటు.. పలువురి నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా వడివడిగా నిర్ణయాలు తీసుకున్నారు.
ధరణి వెబ్ పోర్టల్ నుఅందుబాటులోకి తెచ్చిన రెండునెలల కాలంలో 1.1 లక్షల మంది ధరణి స్టాట్ బుక్ చేసుకున్నారని.. 80 వేల మంది రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఐదు ఎకరాల లోపు రైతులు 90 శాతం మంది వరకు ఉంటారని.. అలాంటి చిన్న రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా భూములు రిజిస్టర్ చేయించుకొని.. మ్యుటేషన్ చేయించుకోవటానికి వీలుగా ఉండాలన్నదే ధరణి లక్ష్యమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
పలువురు మంత్రులు..సీనియర్ అధికారులు.. కలెక్టర్లతో సుదీర్ఘంగా మాట్లాడిన అనంతరం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్ణయాలు తీసుకుంది. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన ఆదేశాల్ని చూసినప్పుడు అనిపించేది ఒక్కటే. ఇదే రీతిలో సీఎం సారు ఫాంహౌస్ కు పోకుండా పాలన మీదనే ఫోకస్ మరెన్ని నిర్ణయాలు తీసుకుంటారో అన్న భావన కలుగక మానదు. అంతేకాదు.. పాలనలోనూ వినూత్న మార్పులకు అవకాశం ఉంటుందని చెప్పక తప్పదు.
విస్తృత చర్చల అనంతరం తీసుకున్న నిర్ణయాలు.. అధికారికంగా జారీ అయిన ఆదేశాల్ని చూస్తే..
- పట్టాదార్ పాసు బుక్కులు పోయినట్లయితే.. వాటి స్థానంలో సర్టిఫైడ్ కాపీ తీసుకునే అవకాశం కల్పించాలి.
- ప్రభుత్వ భూములు, చెరువు ఎఫ్‌టీఎల్ భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు, అటవీ భూములను ఎట్టి పరిస్థితుల్లో పైవ్రేటు వ్యక్తులకు రిజిస్టర్ చేయవద్దు.
- ఇనామ్ భూములను సాగు చేసుకుంటున్న హక్కు దారులకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఇచ్చి, ఆ వివరాలను ధరణిలో నమోదు చేయాలి.
- ధరణిలో స్లాట్ బుక్ కాకపోతే, ఎందుకు కావడం లేదనే విషయం దరఖాస్తు దారుడికి తెలిపే ఆప్షన్ ఉండాలి.
- రెవెన్యూ కోర్టుల్లోని భూముల వివాదాలను పరిష్కరించడానికి జిల్లాకు ఒకటి చొప్పున ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయాలి. వాటిని కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించాలి.
- 1/70 చట్టం అమలులో లేని ప్రాంతాల్లో ఆ చట్టం కింద నమోదైన కేసులను పరిష్కరించాలి. అమల్లో ఉన్న చోట ఆ ప్రాంత గిరిజనరుల హక్కులు కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలి.
- రికార్డుల్లో ఉన్న విస్తీర్ణానికి, క్షేత్రస్థాయిలో ఉన్న విస్తీర్ణానికి తేడాలుంటే కలెక్టర్లు విచారణ జరిపి, తుది నిర్ణయం తీసుకోవాలి. ఆ వివరాలను ధరణిలో నమోదు చేసి, పాసు బుక్కులు ఇవ్వాలి.
- ఒక సర్వే నంబర్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ భూములుంటే ఆ సర్వే నంబర్ అంతా నిషేధిత జాబితాలో పెట్టారు. అలాంటి కేసులు ఉన్న చోట కలెక్టర్లు విచారణ జరిపి ప్రభుత్వ భూములను మాత్రమే నిషేధిత జాబితాలో పెట్టాలి.
- కోర్టుల ద్వారా, కలెక్టర్ల ఆధ్వర్యంలోని ట్రైబ్యునళ్ల ద్వారా వచ్చిన అధికారిక తీర్పుల ప్రకారం ధరణిలో భూములకు సంబంధించిన వివరాల్లో మార్పులు, చేర్పులు చేపట్టాలి.
- ధరణి పోర్టల్ ద్వారా లీజ్ అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ చేయించుకునే వెసులుబాటు కల్పించాలి.
- నాలా ద్వారా కన్వర్ట్ అయిన భూములను ధరణిలో నమోదు చేసి, ప్రొసీడింగ్స్ ఇవ్వాలి.
- అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జీపీఏ చేసుకోవడానికి ధరణి పోర్టల్ ద్వారా అవకాశం ఇవ్వాలి.
- వ్యవసాయ భూముల లీజు డీడ్, ఎక్సేంజ్ డీడ్‌ల రిజిస్ట్రేషన్లకు ధరణిలో అవకాశం ఇవ్వాలి.
- సాగు భూముల్లో నెలకొల్పే కంపెనీలు, వివిధ సంస్థలు ఆ భూములను అమ్ముకునేందుకు, కొనుక్కునేందుకు ధరణిలో అవకాశం కల్పించాలి.
- పాస్ పోర్టు నంబరు నమోదు చేసుకుని ఎన్ఆర్ఐ భూములకు పాస్ పుస్తకాలు ఇవ్వాలి.
- ఈసీ, మార్కెట్ వ్యాల్యూ సర్టిఫికెట్లను ఆన్‌లైన్ లో ప్రింట్ తీసుకునే అవకాశం కల్పించాలి.
- స్లాట్ బుక్ చేసుకున్న రోజు రాలేకపోయే వారికి స్లాట్ రద్దు చేసుకోవడానికి, మరో రోజు బుక్ చేసుకునే చాన్స్ ఇవ్వాలి. స్లాట్ రద్దు చేసుకుంటే డబ్బులు తిరిగివ్వాలి.
- చట్టబద్ధ వారసుల పేర్లను రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో అనుమతిదారుల కేటగిరీ కింద నమోదు చేసుకునే ఆప్షన్ కలిగించాలి.
- మైనర్ల పేరిట రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మైనర్లు, సంరక్షకుల పేర పాస్ పుస్తకం ఇవ్వాలి.
- అసైన్ చేసిన భూములు అనుభవిస్తున్న రైతులు మరణిస్తే, వారి చట్టబద్ధ వారసులకు ఆ భూములను బదలాయించాలి.