Begin typing your search above and press return to search.

అన్ లాక్3.0లోనూ ఏపీకి వెళ్లాలంటే ఇవన్నీ చేయాల్సిందే

By:  Tupaki Desk   |   1 Aug 2020 7:50 AM GMT
అన్ లాక్3.0లోనూ ఏపీకి వెళ్లాలంటే ఇవన్నీ చేయాల్సిందే
X
లాక్ డౌన్ సందర్భంగా విధించిన ఆంక్షల్ని సడలిస్తూ.. అన్ లాక్ పేరుతో కేంద్రం నిర్ణయాలు తీసుకుంటోంది. అన్ లాక్ 3.0లో భాగంగా రాష్ట్రాల మధ్య ప్రయాణాలకు ఎలాంటి అనుమతులు అక్కర్లేదు. ఇదే విషయం కొన్ని మీడియా సంస్థల్లోనూ.. సోషల్ మీడియాలోనూ భారీ ఎత్తున ప్రచారం సాగుతోంది. దీన్ని నమ్మి.. ఏపీకి బయలుదేరితే మాత్రం అడ్డంగా బుక్ అయినట్లేనని చెబుతున్నారు.

ఎందుకంటే అన్ లాక్ 3.0 అమల్లోకి వచ్చినప్పటికీ ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారిని అనుమతించటం లేదు. ఆ రాష్ట్రానికి చెందిన స్పందన యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని.. ఏపీకి రావాలనుకుంటున్న వివరాలు.. అవసరాన్ని పేర్కొనాల్సి ఉంటుంది. అలా దరఖాస్తు చేసుకున్న తర్వాత ప్రయాణ అనుమతి వస్తుంది. అప్పుడు మాత్రమే ఏపీలోకి అడుగు పెట్టే వీలుంది.

ఈపాస్ లో వాహనదారులు నమోదు చేసుకున్న వివరాల్ని క్రాస్ చెక్ చేస్తారు. ఈపాస్ కోసం అప్లై చేసుకున్న సందర్భంలో ఆధార్ నెంబరుతో పాటు.. అడ్రస్ చెక్ ఉంటుంది. దీనికి తోడు ప్రయాణం చేసే వారిలో ఎవరికైనా అనుమానిత లక్షణాలు ఉంటే తప్పనిసరిగా కోవిడ్ పరీక్ష చేయించుకోవాల్సిందే.
ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల లోపు మాత్రమే ఏపీలోకి అనుమతిస్తారు. రాత్రి ఏడు దాటిన తర్వాత ఏపీ సరిహద్దుల్లోకి అనుమతించరు. ఒకవేళ.. అత్యవసరాల కోసం వెళ్లే వారిని మాత్రం కారణం తెలుసుకొని మాత్రమే అనుమతిస్తారు. సో.. ఏపీకి వెళ్లాలనుకునే వారు ఉత్సాహంతో బయలుదేరితే మాత్రం సరిహద్దుల్లోని చెక్ పోస్టుల దగ్గర తిప్పలు తప్పవు. సో.. బీకేర్ పుల్.