Begin typing your search above and press return to search.

వాక్‌ స్వాతంత్య్ర హక్కు : ఎక్కడ ఆరంభం అవుతుంది? ఎక్కడ అంతం అవుతుంది?

By:  Tupaki Desk   |   16 Feb 2021 7:07 AM GMT
వాక్‌ స్వాతంత్య్ర హక్కు : ఎక్కడ ఆరంభం అవుతుంది? ఎక్కడ అంతం అవుతుంది?
X
ఏపీలో లోకల్ ఎన్నికల సమయంలో ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ , ప్రభుత్వ మంత్రుల మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. కొందరు మంత్రులు ఈసీ పైసంచలన వ్యాఖ్యలు చేయడం తో వారిపై నిమ్మగడ్డ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రి కొడాలి నాని పై ఏకంగా కేసు నమోదు చేయాలనీ ఆదేశాలు జారీచేశారు. ఈ కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. మీడియాతో మాట్లాడకుండా ఎన్నికల కమిషన్‌ పలువురు నేతలపై ఆంక్షలు విధించడం తో ... మా వాక్‌ స్వాతంత్య్ర హక్కు దెబ్బతింటోంది’ అంటూ వారు హైకోర్టును ఆశ్రయిస్తుండటంతో అసలు వాక్‌ స్వేచ్ఛకు పరిమితులేమిటో తేలుస్తామని కోర్టు స్పష్టం చేసింది.

ఈ విషయంలో కోర్టు సహాయకుడి గా సీనియర్‌ న్యాయవాది పి.శ్రీరఘురాంను నియమించింది. వాక్‌ స్వాతంత్య్ర హక్కుకు పరిమితులు లేవా? ఈ స్వేచ్ఛ ఎక్కడ ఆరంభం అవుతుంది, ఎక్కడ అంతం అవుతుంది అనే విషయాన్ని తేలుస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది.ఎస్ ‌ఈసీపై అభ్యంతరకర వ్యాఖ్యలు, ఆంక్షలకు సంబంధించి వారంలోనే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎమ్మెల్యే జోగి రమేశ్‌, మంత్రి కొడాలి నాని హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారని గుర్తు చేసింది. మీడియా సమావేశంలో ఎస్‌ ఈసీని లక్ష్యంగా మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యల వీడియో టేపులను న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజులు సోమవారం కోర్టు హాలు లో స్వయంగా వీక్షించారు. విచారణను బుధవారానికి వాయిదా వేశారు.

అంతకుముందు ఎస్ ‌ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీ కుమార్‌ వాదనలు వినిపిస్తూ... మంత్రి కొడాలి నాని కోడ్‌ అమల్లోకి రాకముందు తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా ఎస్ ‌ఈసీ పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఎస్ ‌ఈసీ ప్రతిష్ఠను దిగజార్చేలా మంత్రి వ్యాఖ్యలు చేశారు. పరుష పదజాలంలో దాడి చేశారు. ఇలాంటివి అడ్డుకోకపోతే వ్యవస్థల ప్రతిష్ఠలు దిగజారతాయి’’ అని తెలిపారు. అందువల్లే, ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు మీడియాతో మాట్లాడకుండా నిలువరించామని తెలిపారు. కొడాలి నాని తరఫున న్యాయవాది ప్రశాంత్‌ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల న్యాయవాదులు కోర్టు ముందుంచిన వివరాలు సంతృప్తికరంగా లేవన్నారు.