Begin typing your search above and press return to search.

కలుపు మొక్కతో రొమ్ము క్యాన్సర్ ని అరికట్టవచ్చట !

By:  Tupaki Desk   |   31 Oct 2020 3:50 PM GMT
కలుపు మొక్కతో రొమ్ము క్యాన్సర్ ని అరికట్టవచ్చట !
X
రొమ్ము క్యాన్సర్ అనగానే మహిళలకు వచ్చే వ్యాధి అని భావిస్తుంటాం. కానీ పురుషులకు కూడా ఈ భయంకరమైన వ్యాధి వచ్చే అవకాశం ఉంది. మగవారిలో రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా వృద్ధాప్యంలో సంభవిస్తుంది. యువకులకు ఉన్నప్పడు బ్రెస్ట్ క్యాన్సర్ చాలా అరుదగా వస్తుంది. ఈ భయంకరమైన రొమ్ము కేన్సర్ వ్యాధి పై సరైన అవగాహన లేక ప్రతి ఏడాది కొన్ని వేల మంది మహిళలు చనిపోతున్నారు. ప్రతి లక్ష మంది మహిళల్లో 33 మంది బ్రెస్ట్ కేన్సర్ బారిన పడుతున్నట్లు ఐసీఎంఆర్ అంచనా వేసింది. ఇక దేశంలో ఏటా లక్ష మందికిపైగా రొమ్ము కేన్సర్ బారినపడుతున్నారు.

2020కి దేశంలో రొమ్ము కేన్సర్ బాధితుల సంఖ్య 1797900 కి చేరవచ్చని జాతీయ బయో టెక్నాలజీ సమాచార కేంద్రం అంచనా వేసింది. జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, అవగాహనా లోపాలను రొమ్ము కేన్సర్ కి కారణాలని తెలిపింది. ఈ వ్యాధి లక్షణాలను ముందుగానే గుర్తించడం వల్ల సమస్య గురించి ముందునుంచే జాగ్రత్త పడొచ్చు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. చాలా మంది మహిళలకు వారు బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలియదు కూడా. దీంతో వ్యాధి ముదిరేవరకూ అలానే ఉంటున్నారు. చివరికీ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటివరకు ఉన్న ఓ కలుపు మొక్కే. ఇప్పుడది రొమ్ము కేన్సర్‌పై ఉక్కుపాదం మోపగల దివ్య ఔషధి గా మారిపోయింది. అరబిడోప్సిస్‌ థాలియానా లేదా థేల్‌ క్రెస్‌ మొక్కలో రొమ్ము కేన్సర్‌ కణాల పెరుగుదలను నిలువరించే ఔషధ గుణాలు ఉన్నాయని యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. కీమోథెరపీలో కేన్సర్‌ కణాలతో పాటు ఆ భాగంలోని సాధారణ కణాలు కూడా నశిస్తాయి. ఈ లోపాన్ని అధిగమించేలా థేల్‌ క్రెస్‌ మొక్క పనిచేస్తుంది. ఇది కేన్సర్‌ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. కానీ సాధారణ కణాల జోలికి మాత్రం పోదు. తద్వారా చికిత్స వల్ల కేన్సర్‌ రోగి ఆరోగ్యపరంగా బలహీనపడే అవకాశాలు చాలావరకు తగ్గుతాయని చెప్తున్నారు.