Begin typing your search above and press return to search.
అక్కడి ఫలితం.. ట్రంప్ మాటల్లో మార్పు తెచ్చేసిందా?
By: Tupaki Desk | 15 Nov 2020 4:45 AM GMTఓవైపు ఎన్నికల ఫలితాలు వెల్లడై.. ప్రత్యర్థి విజయం దిశగా స్పష్టమైన మెజార్టీని సాధించిన తర్వాత కూడా.. అతడి ఓటమిని ఒప్పుకనేది లేదంటూ మొండికేసే తీరు చాలా అరుదుగా ఉంటుంది.అలాంటి తీరును ప్రదర్శిస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా విమర్శల్ని ఎదుర్కొంటున్నారు డొనాల్డ్ ట్రంప్. తాను నమ్మిందే వేదం అన్నట్లుగా వ్యవహరిస్తున్న ఆయన.. ఎన్నికల్లో తాను ఓడిపోలేదని.. ప్రత్యర్థి పార్టీ వారు మోసంతో గెలిచారని.. రీకౌంటింగ్ చేపడితే అసలు రంగు బయటకు వస్తుందంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఇప్పటికి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొన్ని రాష్ట్రాల్లో సాగుతూనే ఉంది. శనివారం జార్జియా రాష్ట్ర ఫలితం వెల్లడైంది. దీంతో.. బైడెన్ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 300 ప్లస్ కు చేరుకున్నాయి. ఈ ఫలితం తర్వాత నుంచి ట్రంప్ లో మార్పుకాస్త మొదలైనట్లుగా చెబుతున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఇప్పటివరకు ఎన్నికల్లో తానే గెలిచినట్లుగా చెప్పే ఆయన.. అందుకు భిన్నమైన వ్యాఖ్యలు ఆయన నోటి నుంచి రావటం దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు.
తాజాగా ట్రంప్ పాల్గొన్న సమావేశంలో ఈ ప్రభుత్వం లాక్ డౌన్ లోకి వెళ్లదు.. రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వం ఉంటుందో ఎవరికి తెలుసు? నాకు తెలిసి దీనికి సమాధానం సమయమే చెబుతుందన్న వ్యాఖ్య రావటం గమనార్హం. ఓవైపు ఓటమిని అంగీకరిస్తున్నట్లుగా వ్యాఖ్యలు చేస్తూనే మరోవైపు మాత్రం గెలుపు తనదేనంటూ ద్వంద వ్యాఖ్యలు ఆయన మాటల్లో వినిపిస్తున్నాయి. ‘‘గెలుపు నాదే. భవిష్యత్తే గెలుపు ఎవరిదో నిర్ణయిస్తుంది’’ అన్న మాటలే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు.
ఎన్నికల్లో తాను విజయంసాధించినట్లుగా పేర్కొంటూ కోర్టుల్ని ఆశ్రయించిన ట్రంప్.. అక్కడా ఎలాంటి ప్రయోజనం ఉండదన్న మాట వినిపిస్తోంది. ఇలాంటివేళలోనే జార్జియా ఫలితం రావటం.. అది తనకు ప్రతికూలంగా ఉండటంతో ఆయన తీరు కాస్త మారిందన్నమాట వినిపిస్తోంది.మరోవైపు.. ఎన్నికల్లో గెలిచిన బైడెన్ వచ్చే జనవరి 20న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ లోపు మరెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.