Begin typing your search above and press return to search.

తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోతవ్సం వాయిదా.. కారణమిదే

By:  Tupaki Desk   |   11 Feb 2023 10:10 AM GMT
తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోతవ్సం వాయిదా.. కారణమిదే
X
కేసీఆర్ బర్త్ డే నాడు తెలంగాణప్రజలకు నూతన సెక్రటేరియట్ ను కానుకగా ఇద్దామని బీఆర్ఎస్ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా రెడీ అయిన వేళ వారి ఆశలపై నీళ్లు చల్లారు. ఈ మేరకు ఈ భారీ ప్రోగ్రాం వాయిదా పడడం అందరినీ ఊసురుమనిపించింది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఫిబ్రవరి 17న జరగాల్సిన తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవన ప్రారంభోత్సవం వాయిదా పడింది. భారత ఎన్నికల సంఘం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సంప్రదించిన అనంతరం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. త్వరలో తాజా తేదీని ప్రకటిస్తారు.

మంత్రి కేటీఆర్ తెలంగాణ నూతన సచివాలయ ఆవిర్భావ వేడుకలకు పార్టీ నాయకులు, క్యాడర్‌ను సిద్ధం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల ప్రజాప్రతినిధులతో రామారావు గురువారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నేతలకు మంత్రి సూచించారు.

సచివాలయ ప్రారంభోత్సవం తర్వాత నిర్వహించే పరేడ్ గ్రౌండ్స్ సమావేశానికి జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 10 వేల మందిని నేతలు తరలిరావాలని కేటీఆర్ అన్నారు. ఫిబ్రవరి 13న జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా క్యాడర్‌ మీట్‌ నిర్వహించి ప్రజలను చైతన్యవంతం చేయాలని నేతలకు సూచించారు. ఇతర జిల్లాలకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఒక్కో నియోజకవర్గానికి ఇంచార్జ్‌లుగా నియమించి ఫిబ్రవరి 13 నుంచి ఫిబ్రవరి 17 వరకు సెగ్మెంట్లలోనే ఉంటారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఫిబ్రవరి 17న కొత్త సచివాలయాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయగా ఎన్నికల కోడ్ కారణంగా ఇప్పుడు ఈ భారీ వేడుక అర్థాంతరంగా వాయిదా వేయాల్సి వచ్చింది. అనేక కోట్ల రూపాయలకు పైగా అంచనాతో నిర్మించిన ఈ సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టనున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.