Begin typing your search above and press return to search.
మదనపల్లె హత్యలకు కారణం వేరే ఉండొచ్చు.. లాయర్
By: Tupaki Desk | 31 Jan 2021 2:30 AM GMTఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా మదనపల్లి జంట హత్యల కేసులో మూఢనమ్మకాలే ప్రధాన కారణమని, ఆ మైకంలోనే తల్లిదండ్రులు పిల్లలను హత్య చేశారని పోలీసులు ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్న విషయం తెలిసిందే. ఐతే పురుషోత్తంనాయుడు, పద్మజ మానసిక స్థితి సరిగా లేకపోవడంతో.. వాస్తవంగా ఏం జరిగి ఉంటుందనేది అంచనాకు రాలేకపోతున్నారు. కాగా.. ఓ లాయర్ మాత్రం కారణం వేరే ఉండొచ్చని అంటున్నారు.
మదనపల్లె సబ్ జైలులో ఉన్న పురుషోత్తంనాయుడుని రజని అనే న్యాయవాది కలిశారు. హత్యల వెనుక ఏదో మిస్టరీ ఉండే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ కు చెందిన లాయర్ కృష్ణమాచార్య తరపున వచ్చిన లాయర్ రజని.. శనివారం వారిని కలిసి మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే.. జైలు అధికారులు నేరుగా కలిసేందుకు అనుమతివ్వలేదు. దీంతో ఆమె.. దూరంగా ఉండే పురుషోత్తం నాయుడుతో కాసేపు మాట్లాడారు. హత్యలకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. పది నిముషాల తర్వాత సమయం అయిపోయినట్లు అధికారులు చెప్పడంతో వెనుదిరిగారు.
పురుషోత్తంనాయుడుతో మాట్లాడిన తర్వాత జంటహత్యలకు ప్రధాన కారణం క్షుద్రపూజలు కాకపోవచ్చని ఆమె అన్నారు. ఇప్పటివరకు తెలిసిన వివరాలు, పురుషోత్తంనాయుడు ఇంట్లోని దృశ్యాలను పరిశీలించిన తర్వాత దీని వెనుక మరో కారణం ఉండి ఉండొచ్చన్నారు. ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగు చుడాలన్నారు. నిందితులకు న్యాయసలహా అవసరమని భావించే ఇక్కడికి వచ్చినట్లు ఆమె చెప్పారు.