Begin typing your search above and press return to search.

ప్రతీ ఐదుగురు మహిళల్లో ఒకరి ఎఫైర్

By:  Tupaki Desk   |   10 Oct 2019 4:50 PM GMT
ప్రతీ ఐదుగురు మహిళల్లో ఒకరి ఎఫైర్
X
‘సెక్స్ అండ్ రిలేషన్ షిప్’ పేరిట ప్రముఖ మ్యాగజైన్ ‘ఫిమేల్’ నిర్వహించిన సర్వే ఇప్పుడు బ్రిటన్ తోపాటు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భర్తకు తెలియకుండా పరపురుషుడితో సెక్స్ సంబంధాలు పెట్టుకున్న మహిళలు ఇంగ్లండ్ దేశంలో ప్రతీ ఐదుగురిలో ఒకరు ఉన్నారని సంచలన నిజం వెలుగుచూసింది. ఈ మహిళలు కూడా మొగుడు కంటే బ్యాయ్ ఫ్రెండ్ తోనే తాము సెక్స్ సుఖం ఎక్కువగా అనుభూతి చెందినట్టు సర్వేలో పేర్కొన్నారు.

ఇక బ్యాయ్ ఫ్రెండ్ తో సెక్స్ జీవితాన్ని పంచుకుంటున్నా ఆ మహిళలు భర్తలతో విడిపోమని తెలుపడం విశేషం. ఇక భార్యలు బ్యాయ్ ఫ్రెండ్ లతో ఎంజాయ్ చేసినా ఆ భర్తలకు భార్యలపై అనుమానం రాలేదని తేలింది. దాదాపు వెయ్యిమంది మహిళల సెక్స్ గురించి ఆరాతీయగా ఈ సంచలన విషయాలు వెలుగుచూశాయి.

పరపురుషుడితో సెక్స్ సుఖం బాగా ఉన్నా భర్తలను వదిలి పెట్టాలన్న ఉద్దేశం లేదని సదురు మహిళలు పేర్కొనడం విశేషం. తమ కుటుంబం విచ్చిన్నమవుతుందని.. సామాజిక జీవితం ముఖ్యమని.. వాటిని వదలుకోవడం ఇష్టం లేని కారణంగానే బ్యాయ్ ఫ్రెండ్ లతో కేవలం సెక్స్ చేసి వదిలేస్తున్నామని చెప్పారు. ఇలా చేయడం వల్ల తాము మానసిక ప్రశాంతత పొందుతున్నట్టు సదురు మహిళలు పేర్కొనడం గమనార్హం. ఎక్కువ మంది తమకు భర్తలను వదిలేసే ఉద్దేశం లేదని చెప్పగా.. పరుపురుషులతో సెక్స్ అనుభూతి బాగుందని కితాబివ్వడం విశేషం.