Begin typing your search above and press return to search.

పాపం.. ప్రధాని పెళ్లి ఆగిపోయింది!

By:  Tupaki Desk   |   17 Aug 2022 9:16 AM GMT
పాపం.. ప్రధాని పెళ్లి ఆగిపోయింది!
X
కొవిడ్ విజృంభించిన నేపథ్యంలో చాలా దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి. రాకపోకలు నిలిపివేశాయి. అయితే కాస్త తగ్గుముఖం పట్టిన తరువాత పరిమితులు విధించి పెళ్లిళ్లు చేసుకోవాలని నిర్ణయించారు. ప్రస్తుతం భారత్ తో సహా పలు దేశాల్లో పెళ్లిళ్లపై ఎలాంటి పరిమితి లేదు. కానీ న్యూజిలాండ్ లో మాత్రం అతికొద్దిమంది సమక్షంలోనే పెళ్లి జరుపుకోవాలని ఆదివారం నుంచి నిబంధనలు జారీ చేశారు. ఇక్కడ ఒమిక్రాన్ వైరస్ విజృంభిస్తుండడంతో ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేసింది.

అయితే ఈ ఆంక్షల కారణంగా ప్రధాని జపిండా ఆర్డెన్ తన వివాహాన్ని రద్దు చేసుకున్నారు. ప్రజల ప్రాణాల కంటే తన వివాహం పెద్ద విషయం కాదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కరోనా మొదటి దశలో న్యూజిలాండ్ లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కానీ డెల్టా వేరియంట్ నుంచి ఇక్కడి పరిస్థితి మారింది.

న్యూజిలాండ్ లో ఇప్పటి వరకు 15,104 కరోనా కేసులు నమోదయ్యాయి. 52 మంది మృతి చెందారు. ఈ దేశంలో తాజాగా 9 కేసులు నమోదు కావడంతో ఆంక్షలను కఠినతరం చేశారు. ఆక్లాండ్ లో ఓ వివాహానికి హాజరైన తరువాత ఓ కుటుంబం మొత్తం కొవిడ్ బారిన పడింది. ఆ తరువాత ఫ్లైట్ అటెండెంట్ కూ వైరస్ సోకింది. అయితే కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ ఎక్కువవుతుందని ఆంక్షలను కఠినతరం చేశారు. ఏవైనా కార్యక్రమాలు నిర్వహిస్తే గరిష్టంగా 100 మంది వ్యాక్సిన్ వేయించుకున్నవారికి మాత్రమే అనుమతి ఉంది. ఒకవేళ వ్యాక్సిన్ వినియోగించకపోతే 25 మంది కంటే ఎక్కువ మంది హాజరు కావొద్దనే నిబంధన ఉంది.

ఈ పరిస్థితుల్లో న్యూజిలాండ్ ప్రధాని తన వివాహాన్ని రద్దు చేసుకున్నారు. 'కొవిడ్ కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. వారు బాగుండాలనే నేను కోరుకుంటున్నా. ఇలాంటి సమయంలో నేను సంతోషంగా నా వివాహాన్ని జరుపుకోలేను. వారి ఆరోగ్యం కంటే నా పెళ్లి పెద్ద విషయమేమి కాదు. మనం బాగా ప్రేమించేవారు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నా..మనం వారితో ఉండలేకపోతున్నాం.. ఈ పరిస్థితి చాలా ఆందోళనకరం. అందువల్ల నా వివాహాన్ని రద్దు చేసుకుంటున్నా' అని ప్రకటన చేశారు.

టీవీ యాంకర్ క్లార్క్ గే పోర్డ్ తో ఆమె పెళ్లి జరగాల్సి ఉంది. అయితే వీరిద్దరు ఎప్పటి నుంచో కలిసి ఉంటున్నారు. ఈమధ్య వివాహం చేసుకోవాలని నిర్ణయించకున్నారు. కరోనా వచ్చిన కొత్తల్లో న్యూజిలాండ్ లో కఠిన ఆంక్షలను అమలు చేశారు. ఇతర దేశాలతో సంబంధాలను పూర్తిగా తెంచేశారు.

సరిహద్దులను మూసివేశారు. అయితే డెల్టా వేరియంట్ మొదలయ్యాక ఇక్కడి పరిస్తితి పూర్తి మారింది. కరోనాను పాండమిక్ గా కాకుండా ఎండమిక్ గా భావిస్తున్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ లో 12 ఏళ్లకు పైబడిన వారు 94 శాతం మందికి పూర్తిగా వ్యాక్సిన్ వేయించుకున్నారు.