Begin typing your search above and press return to search.
కన్నీళ్లకు కరిగిపోవాలి.. విమర్శలు చేస్తే రాబంధులు అవుతారు
By: Tupaki Desk | 27 May 2021 4:38 AM GMTదేశంలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. అటు కేంద్రంలో కానీ కొన్ని రాష్ట్రాల్లో కానీ ప్రభుత్వాల్ని మెచ్చుకోలు తప్పించి.. ఏ మాత్రం విమర్శ అన్నది చేయకూడదు. పాలనా పరంగా ఎంత ఫెయిల్ అయినా వారిని ఒక్క మాట అనకూడదు. ఒకవేళ.. వారి తప్పుల్ని ఎత్తి చూపిస్తే చాలు.. ఎంత మాట పడితే అంత మాట అనేందుకు వెనుకాడరు. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు సైతం గల్లీ స్థాయి నాయకుల మాదిరి నోరు పారేసుకోవటం ఇటీవల మొదలైన కొత్త అలవాటుగా చెప్పాలి. అదే సమయంలో.. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు తప్పులు చేస్తే.. గతంలో తాము కొన్ని తప్పులు చేశామని.. వాటిని దిద్దుకుంటామని మాట వరసకు చెప్పేవారు.. తమ వైఫల్యాల్ని ఒప్పుకోవటం ద్వారా వాటిని కడిగేసుకునే ప్రయత్నం చేసేవారు.
ఇప్పుడు అందుకు పూర్తి భిన్నం. ఎవరెన్ని చెప్పినా.. తప్పు చేశామన్న మాట.. మాట వరసకు కూడా ఒప్పుకోని తత్త్వం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్ తీరు ఇందుకు నిదర్శనంగా చెప్పాలి. దేశంలో నమోదైన కొవిడ్ కేసులు.. మరణాలపై న్యూయార్కు టైమ్స్ సంచలన కథనాన్ని పబ్లిష్ చేసింది. తాము అచ్చు వేసిన కథనంలో పలు అంశాల్ని ప్రస్తావించింది.
ఈ కథనాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. దీనిపై హర్షవర్దన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. రాహుల్ ను రాబందుతో పోల్చేందుకు వెనుకాడలేదు. ఢిల్లీ కంటే న్యూయార్కును ఎక్కువగా విశ్వసిస్తారన్న ఆయన మాటలో అర్థం లేదనే చెప్పాలి. దేశంలో కొవిడ్ కేసులు పెరగటానికి.. సెకండ్ వేవ్ కు కారణాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సరైన సమయంలో సరైన రీతిలో వ్యాక్సినేషన్ జరిగి ఉంటే..ఈ రోజున దేశంలో ఇన్ని మరణాలు చోటు చేసుకునేవి కావు. వీటన్నింటిలోనూ ప్రధాని మోడీ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
కొవిడ్ మరణాలపై ఇటీవల చేసిన రివ్యూ సందర్భంగా ప్రధాని కన్నీరు పెట్టుకున్నారు. ఆయన కన్నీటి వార్తల్ని మీడియా భారీగా హైలెట్ చేసింది. అంతలా మనసు కదిలిపోయిన మోడీ.. మరణించినకుటుంబాలకు కొంత మేర అయినా సాంత్వన కలిగేలా ఎందుకు నిర్ణయాల్ని ప్రకటించలేదు. తల్లిదండ్రులు ఇద్దరిని కరోనాతో పోగొట్టుకొని అనాదలైన పిల్లలకు కేంద్రం అండగా నిలుస్తుందని.. వారికి కనీసం రూ.25లక్షలతో పాటు.. నవోదయ స్కూళ్లలో విద్యాభాస్యానికి కేంద్రం బాధ్యత తీసుకుంటుందన్న ప్రకటన లాంటివి ఎందుకు చేయలేకపోయారు? అన్నది ప్రశ్న.
ఇదిలా ఉంటే.. మోడీ కన్నీళ్లకు జాతి జనులు కరిగిపోవాలే కానీ.. చోటు చేసుకున్న మరణాలకు బదులుగా.. ఆయా కుటుంబాలకు మోడీ సర్కారు మాత్రం ఎలాంటి మాట ఇవ్వదన్న మాట. తమ ప్రభుత్వాన్ని.. తమ వైఫల్యాల్ని ఎత్తి చూపిన రాహుల్ పై కేంద్ర మంత్రి హర్షవర్దన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. దారుణ వ్యాఖ్యలు చేశారు. ‘శవాలతో రాజకీయాలు చేయటం కాంగ్రెస్ స్టైల్. చెట్ల మీద ఉండే రాబందులు శవాల్ని పీక్కు తింటాయి. కానీ.. ప్రస్తుతం అవి అంతరించిపోతున్నాయి. కానీ.. వాటి అలవాట్లను నేల మీద ఉన్న మానవ రాబందులు అలవాటు చేసుకుంటున్నాయి’’ అంటూ విరుచుకుపడ్డారు. ఒక అంతర్జాతీయ రిపోర్టును ఉటంకిస్తే.. కేంద్రమంత్రి వారికి కోపం ఎందుకు కట్టలు తెగుతోంది?