Begin typing your search above and press return to search.
ఆ కారు ధర అక్షరాలా రూ. 210 కోట్లు ... ప్రత్యేకత ఏమిటంటే ?
By: Tupaki Desk | 29 May 2021 11:30 PM GMTలగ్జరీ కార్ల తయారీకి పెట్టింది పేరు అయిన రోల్స్ రాయిస్ తాజాగా అత్యంత ఖరీదైన మరో కారుని ఆవిష్కరించింది. అదే రోల్స్ రాయిస్ ‘బోట్ టైల్'. కారు చూడటానికి , నడపడానికి బాగానే ఉంటుంది. కానీ, ఆ కారు ధర తెలిస్తే ఆ తర్వాత మనం ఉంటామో , పోతామో మాత్రం ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే ఆ కారు ధర తెలిస్తే ఎవరైనా కూడా దెబ్బకి షాక్ అవ్వాల్సిందే. ఆ రోల్స్ రాయిస్ ‘బోట్ టైల్ కారు ధర అక్షరాలా మన కరెన్సీ లో రూ. 210 కోట్లు(2.8 కోట్ల డాలర్లు). అయితే అధికారికంగా ఆ కారు ధరను ప్రకటించడానికి సంస్థ ఒప్పుకోలేదు. కాని కారు ప్రత్యేకతలను బట్టి ధర ఆ స్థాయిలో ఉండవచ్చని ఆటో రంగ అంచనా వేశారు.
ఈ కొత్త కారును 1932 మోడల్ బోట్ టైల్ యజమానే స్వయంగా కొనుగోలు చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. తమ కోచ్ బిల్డింగ్ సేవలను ప్రసిద్ధమైన కొత్త వ్యాపారంగా అభివృద్ధి చేయడానికి ఇది ఉపయోగపడుతుందని రోల్స్ రాయిస్ తెలిపింది. 1920, 1930 దశాబ్దాల్లో ఇలా ప్రత్యేకంగా డిజైన్ చేసిన కార్లు తిరుగుతూ ఉండేవి. కస్టమర్ పూర్తిగా కారు డిజైనింగ్ ప్రాసెస్ అంతటిలోనూ భాగస్వామి అయ్యేలా ప్రోత్సహిస్తారు. కారు డిజైనింగ్ ప్రాజెక్టు అంతటిలోనూ కస్టమర్లను చురుకైన భాగస్వాములను చేసే ప్రత్యేక సహకార భాగస్వామ్యంగా దీన్ని రోల్స్ రాయిస్ కోచ్ బిల్డ్ డిజైన్ విభాగం అధిపతి అలెక్స్ ఇన్నిస్ అభివర్ణించారు. గతం లో ఎవరూ చూడని అద్భుతం తమ చేతిలోనే ఉందన్న భావం కస్టమర్ కు ఉంటుందని ఆయన అన్నారు. 2017 ఆవిష్కరించిన కూపె స్వెప్టైల్ ప్రత్యేక లక్షణాలన్నీ బోట్ టైల్ లో ఉంటాయని, భవిష్యత్తులో ఆహ్లాదాన్ని కోరే కస్టమర్లందరూ కోచ్ బిల్డింగ్ కు మొగ్గు చూపే లా ఇది ఆకర్షిస్తుందని ఆయన తెలిపారు. ఇక ఈ కారు ప్రత్యేకతలు గురించి ఒకసారి చూస్తే...563 బీహెచ్ పీ 6.75 లీటర్ల ట్విట్ టర్బో వి12 ఇంజన్ జూ 1813 కొత్త విడిభాగాలు, రెండు డోర్లు, నాలుగు సీట్లతో 5900 ఎంఎం పొడుగు, వెనుక వైపు రెండు ఫ్రిజ్‌లతో కూడిన పూర్తి స్థాయి హోస్టింగ్ సూట్ ఉన్నాయి. ఎన్ని ఉన్నా కూడా కారు ధర రూ. 210 కోట్లు అంటే మాములు విషయమా .. !