Begin typing your search above and press return to search.

ఆ కోడి కిలో మాంసం ధర రూ. 1400 .. ఎందుకంటే !

By:  Tupaki Desk   |   17 Oct 2020 1:30 AM GMT
ఆ కోడి కిలో మాంసం ధర రూ. 1400 .. ఎందుకంటే !
X
కోడి మాంసం కిలో రూ.1400, గుడ్డు ఒక్కటి 50 రూపాయలు...అమ్మో ఏంటి అంత ఖరీదా. మనం ఇక కోడి కూర తినలేమా అని అనుకుంటున్నారా? అయితే ఈ కోడి మనం రోజు తినే కోడి కాదు , దీనికి ఒక ప్రత్యేకత ఉంది. అయినా కిలో 1400 హా .. ఏంటి దీని స్పెషాలిటీ అని ఆశ్చర్యపోతున్నారా, ఆ విషయానికి వస్తే ఒక్కటి కాదు.ఈ కోడి పేరు,రూపం దగ్గర్నుంచి అన్నీ ప్రత్యేకతలే. అంతేకాదు దీని మాంసం ఎన్నో పోషక విలువలు కలిగి ఉండటంతో పాటు అరుదైన ఔషధ లక్షణాలు సైతం కలిగి ఉంటుంది. అందుకే ఇది ఇటు మాంసప్రియుల్నే కాదు అటు ఆరోగ్యరాయుళ్లని సైతం విశేషంగా ఆకర్షిస్తోంది.

ఆ కోడి పేరు కడక్ నాథ్. ఈ రకం కోళ్లు మధ్యప్రదేశ్ లో ఉంటాయి.అత్యంత పోషక విలువలు, రోగ నిరోధక శక్తి కలిగిన భారతీయ పెరటి జాతి నాటు కోడి పేరు కడక్ నాథ్. ఈ కోడి ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందుతోంది. ఈ క‌డ‌క్ నాథ్ కోళ్ళ‌ను మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోకాలి-మాసి(న‌ల్ల‌ని మాంసం క‌ల‌ది) అని పిలుస్తారు. ఈ "కడక్ నాథ్" కోడి మధ్యప్రదేశ్, రాజస్థాన్,గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దొరికే స్థానిక జాతికి చెందిన నాటుకోడిగానే ఉంది.

ముదురు నలుపు, ముదురు నీలం రంగుల్లో ఉండే కడక్నాథ్ కోళ్లలో వెంట్రుకలు, చర్మం, మాంసంతో పాటు రక్తం కూడా నల్లగానే ఉంటుంది. ఈ కోళ్ళను కాలామాళి అని కూడా పిలుస్తారు. అరుదుగా, కొన్ని పుంజులు నలుపుతో పాటు బంగారు రంగు ఈకలు కలిగి ఉంటాయి. ఈ కోడి పిల్లలు నీలం రంగు మొదలుకొని నలుపు వరకు ఉండి, వీపు మీద ముదురు రంగు గీతలు ఉంటాయి. అయితే ఇదే జాతి కోడి మరో రెండు రంగుల్లోనూ లభిస్తుంది.ఆరు నెలల వయసు నుండే గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి. వేసవిలో సుమారు 100 గుడ్లు పెడుతుంది. 7 నెలల వ్యవధిలో ఈ కోడి కేవలం 1.5 కేజీల బరువు మాత్రమే పెరుగుతుంది.

ఇక దీని దీని మాంసం బొగ్గులాగా నల్లగా ఉంటుంది, దీని గురించి తెలియాని వాళ్లకి ఈ కడక్ నాథ్ కోడి చికెన్ బిర్యాని పెడితే మాడగొట్టిన బిర్యానీ పెట్టారని తెగ ఫీల్ అయిపోవడం ఖాయం. దీని మాంసంలో ‘మెలనిన్‌' అనే పిగ్మెంట్‌ ఉండటం వల్లే దీని మాంసం నలుపు రంగులో ఉంటుంది. అయితే రంగు ఎలా ఉన్నా దీని మాంసం తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులే చెబుతున్నారు. దీన్ని తింటే జీర్ణ శక్తి, రోగ నిరోధక శక్తి పెరుగుతుందట. పైగా ఈ దీని మాంసం ఇంత ఆరోగ్యకరంగా ఉండటానికి కారణం ఈ కోడి శరీరంలో చాలా తక్కువ కొవ్వు ఉంటుంది. గిరిజనులు కూడా కడక్‌నాథ్‌ కోడి రక్తాన్ని దీర్ఘకాలిక వ్యాధుల నివారణలో, మూలికావైద్యంలో ఉపయోగిస్తారు.