Begin typing your search above and press return to search.

లీట‌రు పెట్రోలు ధ‌ర @114

By:  Tupaki Desk   |   4 July 2021 3:30 PM GMT
లీట‌రు పెట్రోలు ధ‌ర @114
X
డీజిల్, పెట్రోల్‌ ధ‌రలు ఒక్క రూపాయి పెరిగితే.. కేవ‌లం పెట్రోల్ వినియోగించే వారిపైనే ఆ భారం ప‌డుతుంద‌ని అనుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్టే. అది అంత‌టితో ఆగిపోదు. కూర‌గాయ‌ల నుంచి పాల వ‌ర‌కూ.. ఆయిల్ నుంచి బియ్యం వ‌ర‌కూ.. ప్ర‌తీ నిత్యావ‌స‌ర స‌రుకుల మీద కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుంది. అనివార్యంగా.. అన్ని వ‌స్తువుల‌ ధ‌ర‌లు పెరుగుతాయి.

సామాన్య ప్ర‌జ‌లపై ఇంత‌గా భారం మోపే పెట్రో ధ‌ర‌లు వంద రూపాయ‌లు దాటి ప‌రుగులు పెడుతున్నా.. కేంద్ర ప్ర‌భుత్వం చూసీ చూడ‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. కరోణా కార‌ణంగా త‌గిన ఆదాయం లేక‌ ప్ర‌జ‌లు తీవ్రంగా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ఇలాంటి వారిని ఆదుకోవాల్సిన ప్ర‌భుత్వం.. అన్ని ధ‌ర‌లు పెంచుతూ పీడిస్తుండ‌డంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

వాస్త‌వానికి పెట్రోల్ ధ‌ర‌లో.. రాష్ట్రాలు, కేంద్ర ప్ర‌భుత్వం వేసే ప‌న్నులే రెట్టింపు స్థాయిలో ఉంటున్నాయి. పెట్రోల్ ధ‌ర‌లో 60 శాతంపైన‌, డీజిల్ ధ‌ర‌లో 57 శాతం పైన‌ ప‌న్నులే ఉంటున్నాయంటే.. జ‌నాల‌ను ఈ ప్ర‌భుత్వాలు ఎంత‌గా దోపీడి చేస్తున్నాయో అర్థ‌మ‌వుతుంది.

లీట‌రు పెట్రోలు వంద దాటిన త‌ర్వాత కూడా.. ఆగ‌కుండా ప‌రుగులు తీస్తూనే ఉంది. ఆదివారం లీట‌రు పెట్రోల్ ధ‌ర ఏకంగా 114 రూపాయల‌కు చేరింది. రాజస్థాన్ లో ఆల్ టైమ్ హై ధ‌ర న‌మోదైంది. రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో ప్రీమియం పెట్రోల్ ధ‌ర‌ లీటరు రూ .114కు విక్ర‌యించారు. సాధారణ పెట్రోల్ ధర 110.98 రూపాయలు, డీజిల్ ధర 102.61 రూపాయలకు అమ్మారు. ఇంత జ‌రుగుతున్నా కేంద్రం క‌నీసం ప‌ట్టించుకోవ‌ట్లేద‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్తం చేస్తున్నారు జ‌నం.