Begin typing your search above and press return to search.
సంగారెడ్డి కందిలో తయారవుతున్న యుద్ధ ట్యాంకుల సత్తానే వేరట
By: Tupaki Desk | 29 Sep 2020 4:15 AM GMTహైదరాబాద్ శివారులో సంగారెడ్డికి కూసింత దూరంలో కంది అనే చిన్న ఊరు ఉంది. ఐఐటీ క్యాంపస్ మాత్రమే కాదు.. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది. రక్షణ శాఖకు సంబంధించిన ఆయుధాల్ని ఇక్కడ రూపొందిస్తుంటారు. తాజాగా రూ.1094 కోట్ల ఖర్చుతో 156 ఇన్ ఫాంట్రీ కాంబాట్ వెహికిల్ జీఎంపీ-2 యుద్ధట్యాంకుల్ని తయారు చేస్తున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశ రక్షణకు అత్యంత అవసరమైన ఈ యుద్ధ ట్యాంకుల సత్తా తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఇక్కడ తయారవుతున్న యుద్ధ ట్యాంకులకు సంబంధించిన ప్రాజెక్టు జూన్ లో వస్తే.. ఆగస్టు నుంచి వీటి తయారీ షురూ అయ్యింది. రక్షణ శాఖలో యుద్ధ ట్యాంకులు బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలు స్పెషల్ అయితే.. వాటిని తయారు చేస్తోంది తెలుగు నేల మీద కావటం మరో విశేషంగా చెప్పాలి.
కందిలో తయారు చేస్తున్న యుద్ధ ట్యాంకులు రష్యాకు చెందిన బోయివయ మాషిన పెహోటి లాంటి యుద్ధ ట్యాంకులుగా అభివర్ణిస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చిన ఆర్డర్ ను 2023నాటికి పూర్తి చేయనున్నారు. అత్యాధునిక ఆయుధ సంపత్తిని భారత రక్షణ రంగానికి అందించే విషయంలో ఈ యుద్ధ ట్యాంకులుప్రత్యేకంగా నిలవనున్నాయి.
స300 హార్స్ పవర్ ఇంజిన్ తో పాటు.. నేల మీద గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించటం.. నీటిలో గంటకు 7 కిలోమీటర్లు పయనించటం ఈ యుద్ధ ట్యాంకుల ప్రత్యేకతగా చెప్పాలి. ఇక.. ఎంత పెద్ద మంట అయినా దీన్ని చెక్కు చెదరకుండా ఉంచటం మరో స్పెషల్ గా చెప్పాలి. 35 డిగ్రీల కోణంలో వచ్చే అడ్డంకుల్ని సైతం సునాయాసంగా ఛేదించే సత్తా ఉన్న ఈ వార్ ట్యాంకులు భారత రక్షణ శాఖ అమ్ముల పొదిలో కీలక ఆయుధాలుగా మారతాయని చెప్పక తప్పదు.