Begin typing your search above and press return to search.
ఓటమి ఎరుగని వైనం .. 8 సార్లు ఆ కుటుంబానికే సర్పంచ్ పదవి!
By: Tupaki Desk | 16 Feb 2021 1:30 AM GMTప్రకాశం జిల్లా రెడ్డిచెర్ల గ్రామంలో గ్రామ పంచాయతీ ఓటర్లు గత ఎనిమిది ధపాలుగా ఓకె కుటుంబానికి పట్టం కట్టడం ఈ ప్రాంతానికే ఆదర్శం. సాధరణంగా పంచాయతీ ఎన్నికలు అంటే గ్రామాల్లో జరిగే గొడవలు , కొట్లాటలు అన్ని ఇన్ని కావు. ఒకసారి సర్పంచ్ గా గెలిస్తే , మరోసారి అదే కుటుంబం నుండి పోటీ చేయడానికి దాదాపుగా ఎవరు ఒప్పుకోరు. అడపాదడపా రెండుసార్లు ఒకే కుటుంబానికి సర్పంచ్ పదవి వస్తే అదో పెద్ద గొప్ప. అలాంటిది ఓ గ్రామంలో ఎనిమిది ధపాలుగా ఒకే కుటుంబం ఓటమి ఎరుగకుండా సర్పంచ్ పదవిని చేపడుతున్నారు.
1956 నుంచి గత స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఆ కుటుంబానికి గ్రామపంచాయతీ ప్రజలు పట్టం కడుతున్నారు. కొమరోలు మండలం రెడ్డిచెర్ల పంచాయతీలో ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. 1956లో మొదటగా రెడ్డిచెర్ల బాలవీరంరాజు సర్పంచ్‌గా గెలిచారు. అనంతరం బాలవీరంరాజు కుమారుడు లక్ష్మీనరసరాజు ఎన్నికయ్యారు. అనంతరం 5 పర్యాయాలు వారి కుటుంబంలోని రెడ్డిచెర్ల వెంకటేశ్వరరాజు సర్పంచ్ గా ఉన్నారు.
1970 నుంచి 1976 వరకు వెంకటేశ్వరరాజు సర్పంచ్‌గా ఉండగా, 1983–87 వరకు మళ్లీ ఆయనే ఏకగ్రీవ సర్పంచ్‌గా ఉన్నారు. తరువాత 1987–1992 వరకు కూడా ఆయనే ఉన్నారు. 1995–2000 వరకు వెంకటేశ్వరరాజు భార్య అంజనమ్మ సర్పంచ్‌గా ఉన్నారు. అనంతరం రిజర్వేషన్ల ప్రాతిపదిక రావడంతో రెండు దఫాలు ఓసీ, ఎస్సీలకు వచ్చాయి.
దీంతో పోటీలో నిలువలేదు. 2006–2011, 2014–2019లో వెంకటేశ్వరరాజు సర్పంచ్ గా గెలుపొందారు. ఇప్పటి వరకు వీరి కుటుంబం గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి పాలు కాలేదు. వెంకటేశ్వరరాజు ఈమధ్య అనారోగ్యంతో మృతిచెందడంతో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో రెడ్డిచెర్ల గ్రామపంచాయతీకి బీసీ రాగా వెంకటేశ్వరరాజు కోడలు రెడ్డిచెర్ల ఉమాదేవి వైసీపీ బలపరిచిన అభ్యర్థిగా పోటీలో నిలిచారు.