Begin typing your search above and press return to search.

మెదడుకు స్ట్రోక్ వచ్చే అవకాశం.. గుర్తించడం ఎలాగంటే..!

By:  Tupaki Desk   |   31 Oct 2021 5:30 PM GMT
మెదడుకు స్ట్రోక్ వచ్చే అవకాశం.. గుర్తించడం ఎలాగంటే..!
X
మారిన కాలంతో పాటు ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. గుండె స్ట్రోక్, మెదడుకు స్ట్రోక్ వస్తున్నాయి. అవయవాల పనితీరులో ఏదైనా ప్రతిష్టంభన కలిగితే స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. మెదడుకు జరిగే రక్తసరఫరాలో అంతరాయం కలిగితే బ్రెయిన్ కు స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే స్ట్రోక్ వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కనిపించవు. అయితే దీనిని ముందుగా గుర్తిస్తే తగిన వైద్య సహాయం అందించి... ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్యులు తెలిపారు. రోగి ముఖం వేలాడిట్లుగా ఉండడం, ఒకవైపు మొద్దుబారి ఉంటే స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుందని వెల్లడించారు. పేషెంట్ ని నవ్వమని అడిగితే... వెంటనే నవ్వలేక పోతే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటే కాళ్లుచేతులూ బలహీనంగా మారుతాయి. అంటే చేతిలో పట్టులేకపోవడం, కాసేపు కదిలించకపోయినా మొద్దుబారడం జరుగుతుంది. ఇకపోతే చేయిని ఎత్తమని అడిగితే... ఎక్కువసేపు చేతిని ఎత్తి ఉంచలేకపోవడం, ఎత్తగానే కిందకు పడిపోవడం వంటిటి కూడా లక్షణాలే. అంతేకాకుండా మాట్లాడడానికి ఇబ్బంది పడతారు. వెంటవెంటనే సమాధానాలు చెప్పలేకపోతారు. అంతేకాకుండా చిన్నచిన్న ప్రశ్నలకు కూడా క్లారిటీగా ఆన్సర్ ఇవ్వలేకపోతారు. ఇది కూడా పోటు రావడానికి ఒక కారణమని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఎవరికైనా తరుచుగా తీవ్రమైన తలనొప్ప వస్తే అశ్రద్ధ చేయవద్దని హెచ్చరిస్తున్నారు. కారణం లేకుండా తలనొప్పి వస్తే... రక్తస్రావంతో కూడిన స్ట్రోక్ వచ్చే ప్రమాదముందని తెలిపారు.

హఠాత్తుగా బీపీ తగ్గడం, ఒకేసారి కళ్లు తిరగడం, చూపు మందగించడం వంటి లక్షణాలు ఉంటే అప్రమత్తంగా ఉండాలి. చూపు సమస్య కూడా స్ట్రోక్ కు సంకేతమేనని వైద్యులు తెలిపారు. ఎవరికైనా హఠాత్తుగా జ్ఞాపకశక్తి సన్నగిల్లడం వంటి సమస్య ఉంటే జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. అప్పటిదాకా బాగా గుర్తు ఉండే అంశాలు... ఆ తర్వాత చిన్న చిన్న విషయాలను కూడా గుర్తుపెట్టుకోలేని స్థితి ఏర్పడితే స్ట్రోక్ కు సంకేతమేనని చెబుతున్నారు. అయితే ఇవన్నీ మెదడుకు స్ట్రోక్ వచ్చేముందు ఉండే సంకేతాలు అని వైద్య నిపుణులు వివరించారు. రక్త ప్రసరణ మెదడులోని కొన్ని భాగాలకే పరిమితం కావడం వల్లే స్ట్రోక్ వస్తుంది. అయితే ఈ లక్షణాలను ముందే గుర్తించగలిగితే దానిని నివారించే అవకాశం ఉంది. మొదటగా వ్యక్తి సరిగ్గా నవ్వగలరా... చేతులు సరిగ్గా పైకి ఎత్తగలరా? తెలుసుకోవాలి. వీటితో పాటు హైటెన్షన్, డయాబెటిస్ నియంత్రణలో ఉంచుకోవాలి. ఏ కొంచెం ఇబ్బందిగా ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి.

అయితే స్ట్రోక్ అనేది ప్రాణాంతకం. మెదడకుకు రక్తసరఫరా అంతరాయం కలగడం వల్ల వచ్చే ప్రమాదం ఉంది. ఇక స్ట్రోక్ వచ్చినప్పుడు ఒంటరిగా ఉండకూడదు. ఇతరుల సాయం అవసరం. వెంటనే వారికి ప్రథమ చికిత్స అవసరం. స్ట్రోక్ వచ్చినప్పుడు వైద్య సిబ్బందికి లక్షణాలు తెలియజేయాలి. స్ట్రోక్ వచ్చిన సమయంలో రోగికి అయోమయంగా ఉంటుంది. కాళ్లుచేతులు బలహీనంగా ఉంటాయి. నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది. స్ట్రోక్ వచ్చిన సమయంలో ఏం తినకూడదు, తాగకూడదు. ఇక స్ట్రోక్ ను ఎదుర్కొవడానికి మానసిక ప్రశాంతత చాలా అవసరం.