Begin typing your search above and press return to search.
వినాయకుడి విగ్రహాన్ని స్టేషన్ కు తీసుకొచ్చేసిన పోలీసులు
By: Tupaki Desk | 22 Aug 2020 9:10 AM GMTకరోనా నేపథ్యంలో గతానికి భిన్నంగా వినాయకచవితిని నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు పండుగ వచ్చిందంటే చాలు.. వీధుల్ని విగ్రహాలతో కళకళలాడేవి. ఎవరికి వారు తమకు తోచినంతగా విగ్రహాల్ని ఏర్పాటు చేయటం తెలిసిందే. మహమ్మారి నేపథ్యంలో పలు నిబంధనల్ని తీసుకొచ్చిన ప్రభుత్వాలు.. బహిరంగ ప్రదేశాల్లో భారీ ఎత్తున విగ్రహాల్ని ఏర్పాటు చేయటాన్ని అనుమతించమని స్పష్టం చేశారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఏర్పాటు చేసినా.. చిన్న విగ్రహాలతో.. నలుగురైదుగురికి మించి భక్తులతోనే పూజలు నిర్వహించాలని స్పష్టం చేయటం తెలిసిందే.
ఇదిలా ఉంటే సూరత్ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా ఐదు అడుగులకు మించిన ఎత్తున్న విగ్రహాన్ని తీసుకొని.. మండపంలో ఏర్పాటు చేయటానికి తీసుకెళుతున్నారు. అయితే.. వారు ఆ విగ్రహాన్ని పోలీసు కమిషనర్ భవనం ముందు నుంచి తీసుకెళుతున్న సమయంలో.. పోలీసుల కంట్లో పడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ విగ్రహాన్ని ఆపిన పోలీసులు.. దాన్ని సీజ్ చేసి స్టేషన్ వద్ద ఉంచేశారు. అంతేకాదు.. అనుమతి లేకుండా భారీ విగ్రహాన్ని తీసుకెళుతున్న నిర్వాహకులతోపాటు. అర్చకుల మీదా పోలీసులు కేసు నమోదు చేశారు.