Begin typing your search above and press return to search.

విమానం ఎత్తుకెళ్లిపోయారు.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే..!

By:  Tupaki Desk   |   7 Jan 2021 3:30 PM GMT
విమానం ఎత్తుకెళ్లిపోయారు.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే..!
X
బైక్​ దొంగలు, కారు దొంగలు, లారీల దొంగలను చూసి ఉంటారు. కానీ విమానం దొంగల గురించి విన్నారా..! అరిజోనా దేశంలో విమానం దొంగలున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే ఎయిర్​పోర్ట్​ నుంచి ఏకంగా విమానాన్ని ఎత్తుకెళ్లిపోయారు. విమానం దొంగల తెగవను చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. అయితే పోలీసులు ఈ విమానానికి సంబంధించిన ఫొటోలను ఫేస్​బుక్​లో షేర్​ చేశారు. ఎవరికైనా ఈ విమానం కనిపిస్తే వెంటనే సమచారం ఇవ్వాలంటూ పోస్ట్​ పెట్టారు. ఈ ఫొటో సోషల్​మీడియాలో వైరల్​గా మారింది.న్యూ ఇయర్​ రోజు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

ప్రపంచం మొత్తం న్యూ ఇయర్​ వేడుకల్లో మునిగి ఉండగా.. విమానం దొంగలు మాత్రం తమ పని తాము చేసుకున్నారు. బస్సులు, కార్లు, బైకులు కొట్టేస్తే ఏమి మిగలడం లేదని భావించారేమో ఏమో కానీ.. ఏకంగా విమానానికే కన్నం పెట్టారు. అర్ధరాత్రి ఓ కాపలాలేని ఓ సెక్యూరిటీ గేటును ధ్వంసం చేసి వాహనంతోసహా చొరబడ్డారు. అనంతరం విమానాశ్రయంలో ఉన్న ఓ ఎయిర్​క్రాప్ట్​ను, విమాన విడిభాగాలను తీసుకెళ్లారు. అయితే అక్కడ విమానం కంటైనర్​కు తగిలించి ఉంది.. దీంతో విమానాన్ని వాళ్లు తమ వాహనానికి తగిలించుకొని వెళ్లిపోయారు. విమానం టైల్ నంబర్​ ఎన్​153పీఆర్​ అని పోలీసులు తెలిపారు.

విమానం, విడిభాగాల విలువ రూ. 51.23 లక్షలు నుంచి రూ.58.57 లక్షలు ఉండవచ్చన్నారు. ఈ నంబర్​ గల విమానం దాని విడిభాగాలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని పోలీసులు అంటున్నారు. అయితే నిజానికి విమానాశ్రయాలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఉంటాయి. కానీ విమానాశ్రయ గోడలను బద్దలుకొట్టి.. లోపలికి ప్రవేశించడం చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తున్నది. దుండగులకు విమానాశ్రయంలోని సిబ్బంది కూడా సహకరించారేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు సీసీ కెమెరాల ఆధారంగా విచారణను వేగవంతం చేశారు.