Begin typing your search above and press return to search.

బెడిసికొట్టిన నెట్ ఫ్లిక్స్ ప్లాన్.. భారీ ప‌త‌నం దిశ‌గా!

By:  Tupaki Desk   |   27 May 2023 6:54 AM GMT
బెడిసికొట్టిన నెట్ ఫ్లిక్స్ ప్లాన్.. భారీ ప‌త‌నం దిశ‌గా!
X
నెట్ ఫ్లిక్స్ ప్లాన్ బెడిసికొట్టింది. ఇప్పుడంతా ప్లాన్ ఊహించ‌ని విధంగా బ్యాక్ ఫైర్ అవుతోంది. పాస్‌వర్డ్ షేరింగ్ క్రాక్ డౌన్ తర్వాత వినియోగదారులు సబ్ స్క్రిప్షన్ లను రద్దు చేయడం ప్రారంభించ‌డం క‌ల్లోలానికి దారి తీస్తోంది. ఈ వారంలో US అలాగే UK సహా 103 దేశాల్లో నెట్ ఫ్లిక్స్ కొత్త నిబంధనలు అమ‌ల్లోకి తెచ్చింది. నెట్ ఫ్లిక్స్ ని వేరొకరి ఖాతాలో చూస్తున్న వ్యక్తులు ఇప్పుడు వారి స్వంత లాగిన్ లను సృష్టించి వార్షిక చందా చెల్లించాల‌ని కొత్త నియ‌మాన్ని వ‌ల్లించింది. కేవ‌లం సొంత ఇంట్లోనే కాకుండా ఇతర వ్యక్తులతో నెట్ ఫ్లిక్స్ ఖాతాను షేర్ చేసుకోవాలనుకునే వారు £4.99/నెలకు (USలో $8/నెలకు) ధరతో `చెల్లింపు భాగస్వామ్యం` ఆప్ష‌న్ లో సైన్ అప్ అవ్వాల్సిందేన‌ని కొత్త రూల్ ని తెచ్చింది.

పాస్ వర్డ్ షేరింగ్ వ్య‌వ‌హారంపై స్ట్రీమింగ్ దిగ్గజం అణిచివేత ధోర‌ణితో ప‌రిణామాలు వేగంగా మారిపోతున్నాయ‌న్న విశ్లేష‌ణ సాగుతోంది. ఒకే ఒక్క‌ నిర్ణయంతో నెట్ ఫ్లిక్స్ వినియోగదారులలో కోపాన్ని ఆహ్వానించింది. నెటిజ‌నులు తమ కోపాన్ని వెళ్లగక్కేందుకు ట్విట్టర్ స‌హా ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లను ఎంపిక చేసుకున్నారు. నెట్ ఫ్లిక్స్ ఖాతాల నుండి తాము అన్ సబ్ స్క్రైబ్ అవుతామని అయితే దాని కొత్త పాలసీకి కట్టుబడి ఉండబోమని చాలా మంది సోష‌ల్ మీడియాల ద్వారా రివ‌ర్స్ లో హెచ్చ‌రిక‌లు పంపారు.

అయితే స్ట్రీమింగ్ సర్వీస్ తన కొత్త భాగస్వామ్య విధానం గురించి సభ్యులను అప్రమత్తం చేయడం ప్రారంభించిందని.... ఖాతాలు ఒకే ఇంటిలో మాత్రమే భాగస్వామ్యం చేసుకునే వెసులుబాలు ఉంద‌ని పేర్కొంది. ``మీ నెట్ ఫ్లిక్స్ ఖాతా మీ కోసం మీరు నివసించే వ్యక్తుల కోసం - మీ కుటుంబం కోసం`` అంటూ కంపెనీ ఒక పోస్ట్ ని బ్లాగ్ లో పోస్ట్ చేసింది.

ఎవ‌రైనా స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ తమ ఇంటి వెలుపల ఉంటే వారి ప్రొఫైల్ ను బదిలీ చేయవచ్చు. తద్వారా ఆ వ్యక్తి వారి సొంత‌ చెల్లింపు కోసం కొత్త సభ్యత్వాన్ని ప్రారంభించవచ్చు. తమ ఖాతాను ఉపయోగించి వారి ఇంటి వెలుపల ఉన్న వ్యక్తికి నెలకు $7.99 - అదనపు రుసుమును చెల్లించే వెసులు బాటు క‌ల్పించింది..అని మీడియా క‌థ‌నాలు వెల్ల‌డిస్తున్నాయి.

100 మిలియన్లకు పైగా కుటుంబాలు నెట్ ఫ్లిక్స్ ఖాతాలను షేర్ చేసుకుంటున్నాయని స్ట్రీమింగ్ సంస్థ‌ తెలిపింది. ఇది దాని గ్లోబల్ యూజర్ బేస్‌లో 43శాతంగా ఉంది. ఇది కొత్త కంటెంట్ లో పెట్టుబడి పెట్టే సామర్థ్యాన్ని ప్రభావితం చేసిందని నెట్ ఫ్లిక్స్ తెలిపింది. నెట్‌ఫ్లిక్స్ ఈ సంవత్సరం ప్రారంభంలో న్యూజిలాండ్- కెనడా- పోర్చుగల్- స్పెయిన్ వంటి నాలుగు ఇతర దేశాలలో పాస్ వర్డ్ షేరింగ్ మార్గదర్శకాలను వివరించింది. స్ట్రీమర్ ఆ దేశాల్లోని సభ్యులను వారి ఖాతాల కోసం `ప్రాథమిక స్థానం(ఖాతా)` సెట్ చేయమని అడుగుతోందని .. అదనపు క‌నెక్ష‌న్ కు అద‌న‌పు రుసుము చెల్లించాల్సిందేన‌ని ప్ర‌తిపాద‌న పెట్టింది. హోమ్ బేస్ లో నివసించని వారి కోసం రెండు ఉప-ఖాతాలను ఏర్పాటు చేయడానికి వినియోగదారులను అనుమతి అభిస్తుందని చెప్పారు.