Begin typing your search above and press return to search.

శుక్రగ్రహం మీద ఫాస్ఫైన్‌ .. సంచలన విషయాలు వెల్లడించిన శాస్త్రవేత్తలు !

By:  Tupaki Desk   |   15 Sept 2020 2:00 PM IST
శుక్రగ్రహం మీద ఫాస్ఫైన్‌ .. సంచలన విషయాలు వెల్లడించిన శాస్త్రవేత్తలు !
X
ఈ సువిశాలమైన విశ్వం లో భూమి లాంటి గ్రహాలు ఇంకా ఏమైనా ఉన్నాయా ? భూమిపై కాకుండా ఎక్కడైనా జీవులు మనగల అవకాశం ఉందా అనే విషయం గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా ప్రయోగాలు చేస్తుంటారు. అరుణ గ్రహం, చంద్రుడి మీద జీవం మనగడకు గల అవకాశాలను తెలుసుకునేందుకు ప్రయోగాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వెల్లడైన కొన్ని కథనాలు శుక్రుడి మీద జీవం ఉండేందుకు ఆస్కారం ఉన్నట్లు చెప్తున్నాయి. ఇటీవల దీనిపై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు శుక్రగ్రహం పై కఠినమైన ఆమ్ల మేఘాలలో జీవుల ఉనికిని కనుగొన్నారు. పరిశోధకులు వాస్తవ జీవ రూపాలను కనుక్కోనప్పటికీ శుక్రగ్రహంపై ఫాస్ఫిన్ అనే జీవులు ఉన్నాయని ప్రాథమికం గా తేల్చారు. వాతావరణంలో అభివృద్ధి చెందుతున్న బ్యాక్టీరియా ద్వారా ఈ జీవులు ఉత్పత్తి అవుతున్నాయని గుర్తించారు.

అంతర్జాతీయ శాస్త్రీయ బృందం మొదట హవాయి లోని జేమ్స్ క్లర్క్ మాక్స్‌ వెల్ టెలిస్కో‌ప్‌ని ఉపయోగించి ఫాస్ఫిన్‌ ను గుర్తించింది. చిలీలోని అటాకామా లార్జ్ మిల్లీమీటర్ అర్రే రేడియో టెలిస్కోప్‌ ను ఉపయోగించి దీనిని ధృవీకరించింది. నేచర్ ఆస్ట్రానమీ ప్రచురించిన జర్నల్‌ లో ఈ ఆసక్తికర విషయాలు తెలిపారు. దీనిపై వేల్స్‌ లోని కార్డిఫ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త జేన్ గ్రీవ్స్ మాట్లాడుతూ.. శుక్రగ్రహంపై జీవుల కదలిక చూసి నేను చాలా ఆశ్చర్య పోయాను. గ్రహాంతర జీవన ఉనికిపై ఎప్పటి నుండో సైన్స్‌ కు ఉన్న ముఖ్యమైన ప్రశ్నలలో ఒకటి అని అన్నారు.

ఫాస్ఫిన్ -మూడు హైడ్రోజన్ అణువులతో కూడిన భాస్వరం అణువు- ప్రజలకు అత్యంత విషపూరితమైనది. ఈ పరిశోధన టెలిస్కోపులు, ఖగోళ వస్తువుల రసాయన శాస్త్రం మరియు ఇతర లక్షణాలను అధ్యయనం చేయడంలో శాస్త్రవేత్తలకు ఉపయోగపడింది. అయితే మరొ కొందరు శాస్త్రవేత్తలు మాత్రం పాస్ఫిన్‌ ఉన్నంత మాత్రాన జీవం ఉండగలని చెప్పలేమంటున్నారు. ఈ సందర్భంగా కార్డిఫ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీకి చెందిన లీడ్ రచయిత జేన్ గ్రీవ్స్ ఏఎఫ్‌ పీ తో మాట్లాడుతూ.. ‘ఫాస్ఫైన్ ఉన్నంత మాత్రాన ఆ గ్రహం మీద జీవం ఉందని చెప్పలేం. ఒక గ్రహం మీద భాస్వరం సమృద్ధిగా ఉన్నప్పటికి.. జీవం మనుగడకు సంబంధించిన ముఖ్యమైనది అక్కడ లేకపోవచ్చు. ఇతర మూలకాలు ఉండటం వల్ల అక్కడ పరిస్థితులు చాలా వేడిగా.. పొడిగా ఉండవచ్చు’ అని తెలిపారు. అయితే భూమి కాకుండా వేరే రాతి గ్రహం మీద ఫాస్ఫైన్ కనుగొనడం ఇదే మొదటిసారి అన్నారు.

భూమిపై ఫాస్ఫిన్ ఉత్పత్తి చేయడానికి ఖనిజాలు లేదా జీవ పదార్థాల నుండి బ్యాక్టీరియా ఫాస్ఫేట్ తీసుకొని హైడ్రోజన్‌ను జోడిస్తుంది. ''జీవ ప్రక్రియ అవసరం లేకుండా ఈ ఆవిష్కరణను చేయడానికి మేము మా వంతు కృషి చేశాము. మన ప్రస్తుత పరిజ్ఞానంతో, శుక్రగ్రహం మేఘాలలో ఫాస్ఫిన్ ఉనికిని వివరించలేము. దీని ఉపరితలం మరియు వాతావరణం ఆక్సిజన్ సమ్మేళనాలతో సమృద్ధిగా ఉంటాయి, ఇవి ఫాస్ఫిన్‌తో వేగంగా స్పందిచడంతో పాటు వాటిని నాశనం చేస్తాయి.'' అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.