Begin typing your search above and press return to search.
డ్రైనేజీలో పడి వ్యక్తి గల్లంతు .. 34 గంటలు గడిచినా దొరకని ఆచూకీ !
By: Tupaki Desk | 27 Sep 2021 7:30 AM GMTహైదరాబాద్ లో మరోసారి వాన బీభత్సం సృష్టించింది. శనివారం సాయంత్రం భారీ వర్షం పడటంతో హైదరాబాద్ మణికొండలో ఓ వ్యక్తి వరద నీటిలో కొట్టుకుపోయాడు. గోల్డెన్ టెంపుల్ దగ్గర రోడ్డు దాటుతున్న వ్యక్తి డ్రైనేజ్ లైన్ గుంతలో పడ్డాడు. గుంత ఉందని చెబుతున్నా కూడా వర్షం శబ్దంతో అతడికి వినపడలేదు. వర్షపు నీళ్లలో నడుచుకుంటూ వెళ్తూ, డ్రైనేజీ కాలువలో పడ్డాడు. ఆ సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయాడు. గల్లంతైన వ్యక్తి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. డ్రైనేజీ పైపు లైన్ల కోసం తవ్విన గుంతలో పడిపోయాడు. GHMC, DRF సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని , గల్లంతైన వ్యక్తి కోసం వెతుకుతున్నారు.
రజనీకాంత్ మృతదేహం పైప్ లైన్ మధ్యలో ఇరుక్కుని ఉంటుందని రెస్క్యూ బృందాలు అంచనా వేస్తున్నాయి. ఈ మేరకు ప్రధాన కాలువ నుంచి నెక్నంపూర్ చెరువు వరకు నీటి ప్రవాహాన్ని పెంచే ఏర్పాట్లు చేస్తున్నట్లు రెస్క్యూ బృందాలు తెలిపాయి. కాగా.. భారీ వర్షానికి నాలలో రాళ్లు, ఇసుక, చెత్త కొట్టుకువచ్చింది. అయితే.. నాలా ఫ్లో తగ్గడంతో వీటి మధ్య చిక్కుకునే అవకాశం ఉంటుందని ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు తెలిపాయి. నగరంలోని డ్రైన్ మ్యాప్ ఆధారంగా వివిధ మ్యాన్ హోల్స్ వద్ద గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు, జీహెచ్ ఎం సీ, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో గోపిశెట్టి రజనీకాంత్ కోసం సెర్చ్ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. మణికొండ నుంచి నెక్నా పూర్ చెరువు వరకు నాలాను క్షణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
కాగా,గల్లంతైన వ్యక్తిని గోపిశెట్టి రజనీకాంత్ షాద్ నగర్ లోని నోవా గ్రీన్ కంపెనీలో ఆయన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి 9 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చిన రజనీకాంత్.. నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ గుంతలో పడి గల్లంతయ్యాడు. కాగా.. రెండు రోజులు దగ్గరపడుతున్నా రజనీకాంత్ ఆచూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.నగరంలో ప్రతీ ఏటా మ్యాన్ హోల్ లో పడి అమాయకులు మృత్యువాత పడుతున్నారు. నాలా వర్క్ చేసిన సిబ్బంది.చిన్న సైన్ బోర్డులు తప్ప ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయలేదు. భారీ వర్షానికి ఆ సైన్ బోర్డులు కొట్టుకుపోయాయి. ఆ గుంతను గమనించకుండా వచ్చిన ఆ వ్యక్తి నాలాలో పడి గల్లంతయ్యాడు. అధికారుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమంటున్నారు స్థానికులు. మణికొండలో డ్రైనేజీలో గల్లంతైన రజనీకాంత్ కుటుంబసభ్యులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించి, నిర్మాణాల వద్ద జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.