Begin typing your search above and press return to search.

బెంగళూరు - ఢిల్లీ ఫ్లైట్ లో బట్టలిప్పేసిన ప్రయాణికుడు

By:  Tupaki Desk   |   9 April 2021 9:16 AM GMT
బెంగళూరు - ఢిల్లీ ఫ్లైట్ లో బట్టలిప్పేసిన ప్రయాణికుడు
X
సాధారణంగా ప్రాశ్చాత్య దేశాల్లో జరిగే ఉదంతం ఒకటి దేశీయంగా చోటు చేసుకొని సంచలనంగా మారింది. పీకలదాకా మద్యాన్ని సేవించి.. తామేం చేస్తున్నామో తెలీనట్లుగా ఇష్టారాజ్యంగా వ్యవహరించే తీరు.. తాజాగా బెంగళూరు - ఢిల్లీ విమానంలో ఇటీవల చోటు చేసుకుంది. కాస్త ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతంలో షాకింగ్ అంశాలు చోటు చేసుకున్నాయి. ఏప్రిల్ ఆరున ఐ-722 విమానంలో ప్రయాణించే ప్రయాణికుడు ఒకరు బట్టలు విప్పేసి నానా బీభత్సాన్ని క్రియేట్ చేశాడు.

సిబ్బందితో అమర్యాదగా ప్రవర్తిస్తూ షాకింగ్ గా వ్యవహరించాడు. అకస్మాత్తుగా బట్టల్ని పూర్తిగా విప్పేయటంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. తాగిన మత్తులో ఉన్న సదరు ప్రయాణికుడు తొలుత లైఫ్ జాకెట్ల గురించి వాదనకు దిగాడు. సిబ్బందితో అమర్యాదగా వ్యవహరిస్తూ.. అసభ్యంగా ప్రవర్తించాడు. అతన్ని నిలువరించేందుకు ఎయిర్ లైన్స్ సిబ్బంది కిందామీదా పడ్డారు.

ఈ క్రమంలో విమాన సిబ్బందితో పాటు.. అక్కడే ఉన్న ప్రయాణికులు పదే పదే విజ్ఞప్తి చేసిన తర్వాత కాస్త తగ్గాడు. విమానంలో జరిగిన ఈ ఉదంతం గురించి ఢిల్లీలోని ఏటీసీ అధికారులకు సమాచారం అందించి.. విమానాన్ని త్వరగా ల్యాండ్ అయ్యేందుకు అనుమతించాలని కోరారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే.. సీఐఎస్ఎఫ్ సిబ్బందికి అప్పజెప్పారు. అతడిపై చర్యలు తీసుకోవాలని ఎయిర్ లైన్స్ అధికారులు కోరారు. దీంతో.. అతనిపై కేసు నమోదు చేశారు.