Begin typing your search above and press return to search.

హిందూపురాన్ని వ‌దిలేసిన పార్టీలు.. ఏం జ‌రుగుతోందంటే!

By:  Tupaki Desk   |   19 April 2022 3:30 PM GMT
హిందూపురాన్ని వ‌దిలేసిన పార్టీలు.. ఏం జ‌రుగుతోందంటే!
X
ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా.. ప్ర‌స్తుతం స‌త్యసాయి జిల్లాలో ఉన్న హిందూపురం నియోజ‌క‌వ‌ర్గాన్ని అటు అధికార పార్టీ.. ఇటు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలు వ‌దిలేసిన‌ట్టేనా? అస‌లు ఇక్క‌డిప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ఎవ‌రికీ ప‌ట్ట‌వా? ఎవ‌రు ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలుస్తారు? ఇవీ.. గ‌త కొన్ని రోజులుగా తెర‌మీదికి వ‌చ్చిన‌.. వ‌స్తు న్న ప్ర‌శ్న‌. గ‌త 2014, 2019 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి టీడీపీ త‌ర‌ఫున నంద‌మూరి బాల‌కృష్ణ విజ‌యం ద‌క్కిం చుకున్నారు. దీంతో ఇక్కడ టీడీపీ దూకుడు క‌నిపిస్తుందని అంద‌రూ అనుకున్నారు. తొలి టీడీపీ హ‌యాంలో ప‌రిస్థితి బ్యాడ్ అయిపోయింది.

బాల‌య్య సినిమాల బిజీతో ఇక్క‌డ నియ‌మించిన పీఏ గ‌త చంద్ర‌బాబు హ‌యాంలోనే వివాదం అయ్యాడు. దీంతో ఆయ‌న‌ను త‌ప్పించారు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో తాను ఇక్క‌డే ఉంటాన‌ని.. త‌న స‌తీమ‌ణి.. తాను కూడా త‌మ ఆధార్ కార్డుల‌ను ఇక్క‌డ‌కు మార్పించుకున్నామ‌ని.. బాల‌య్య చూపించారు. అంతేకా దు.. ఇక్క‌డే ఒక బంగ‌ళా కూడా కొనుగోలు చేశారు. దీంతో బాల‌య్య ఇక్క‌డ‌కు క‌నీసం నెల‌కు ఒక‌సారైనా వ‌స్తాడ‌ని అనుకున్నారు. కానీ.. ఇప్ప‌టికి ఆయ‌న రెండు సార్లు మాత్ర‌మే ఇక్క‌డ ప‌ర్య‌టించారు.

అది కూడా స‌త్య‌సాయి జిల్లా కు హిందూపురాన్ని కేంద్రంగా చేయాల‌ని డిమాండ్ చేశారు. ఒక‌రెండు రోజులు ఇక్క‌డ ఉండి హ‌డావుడి.. చేసి మ‌ళ్లీ షూటింగుల‌కు వెళ్లిపోయారు. దీంతో హిందూపురం ప‌రిస్థితి ప్ర‌బుత్వం అనుకున్న విధంగానే జ‌రిగిపోయింది.

మ‌రోవైపు.. జ‌గ‌న్ ఆదేశాలో.. లేక మ‌రేమో..తెలియ‌దు కానీ.. హిందూపురంలో వైసీపీ గ‌ళం ఎక్క‌డా వినిపించ‌డం లేదు. క‌నీసం..వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి కూడా ఎవ‌రూ పునాదులు వేసుకునే ప్ర‌య‌త్నం కూడా చేయ‌డం లేదు.

దీంతో అటు గెలిచిన టీడీపీ ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించుకోవ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తుంటే.. ఇటు అధికార పార్టీ నాయ‌కులు కూడా త‌మ గోడు వినిపించుకోవ‌డం లేద‌ని.. పెద్ద ఎత్తున ఆవేద‌న వ్య‌క్త‌మ‌వు తోంది.

ఇక్క‌డి జిల్లాలో హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాల‌ని.. ప్ర‌జ‌లు డిమాండ్ చేసిన‌విష‌యం తెలిసిందే. కానీ, ప్ర‌భుత్వం మాత్రం పుట్ట‌ప‌ర్తిని జిల్లా కేంద్రం చేయ‌డంతోపాటు.. స‌త్యసాయి జిల్లాను ఏర్పాటు చేసింది. దీంతో అటు టీడీపీ,ఇటు వైసీపీకూడా రెండూ.. త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. ఇక్క‌డి ప్ర‌జ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.