Begin typing your search above and press return to search.
గెలిచిన తర్వాత కూడా కన్ఫ్యూజన్ లో మోదీజీ?
By: Tupaki Desk | 1 May 2020 2:30 AM GMTప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్రమైన స్థితిలో ఇరుక్కున్నారు!. ఎవరైనా గెలిస్తే సంతోష పడతారు. ప్రతిష్టాత్మక విషయంలో అడ్డంకులు ఎదురైన తర్వాత దక్కిన ఉపశమనంలో కూడా ఇప్పుడు మోదీ సర్కారు ముందగుడు వేయలేని పరిస్థితి. ఇదంతా ఢిల్లీలోని లుటియెన్స్ జోన్ లో కొత్త పార్లమెంట్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించే సెంట్రల్ విస్టా ప్రాజెక్టు గురించి. ఆ ప్రాజెక్టు పై కోర్టులో వేసిన కేసు గెలుపొందడం గురించి.
ప్రస్తుతమున్న పార్లమెంట్ భవనం, రాష్ట్రపతి భవన్, నార్త్, సౌత్ బ్లాక్ భవనాలన్నీ 1931 లో నిర్మించినవే. పార్లమెంట్ కొత్త బిల్డింగ్ నిర్మించాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. దీంతో పార్లమెంటు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాన్ని సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పేరుతో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన విషయం తెలిసిందే. కేంద్రం రెండు వేల కోట్లతో చేపట్టిన ఈ నిర్మాణానికి వ్యతిరేకంగా పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం భూ వినియోగ మార్పిడి చేస్తూ రీ డెవలప్‌మెంట్ ప్లాన్ చేసింది. కేంద్రం చేసిన భూ వినియోగ మార్పిడిని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టు లో పిటిషన్లు దాఖలయ్యాయి.
సుప్రీంకోర్టు లో దాఖలైన పలు పిటిషన్లపై విచారణ చేపట్టిన కోర్టు ప్రాజెక్టును ఆపాల్సిన అవసరం లేదని తెలిపింది. దీంతో లైన్ క్లియర్ అయ్యింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు లో భాగంగా కొత్త పార్లమెంట్ భవనం తో పాటు ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ లకు కొత్త నివాస భవనాలు కట్టనున్నారు. అయితే, ఈ ప్రాజెక్ట్ ను నిలిపి వేయాలని ఇటీవల ప్రధాని రాసిన లేఖలో కాంగ్రెస్ నేత సోనియా కోరారు. ప్రాజెక్ట్ పెట్టే ఖర్చును హాస్పిటల్స్ సౌకర్యాలు కల్పించేందుకు వినియోగించాలని సూచించారు. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో ప్రభుత్వానికి ఆదాయం తగ్గటం, మరోవైపు ఈ ప్రాజెక్టుకు భారీ ఖర్చు కానున్న తరుణంలో... ముందుకు వెళ్తే కేంద్రం విమర్శల పాలు కావడం ఖాయమంటున్నారు.