Begin typing your search above and press return to search.
ఫోన్ నీళ్లలో పడిందని డ్యాంను ఖాళీ చేయించిన అధికారి
By: Tupaki Desk | 27 May 2023 5:00 AM GMTఅధికార మదం తలకెక్కితే మనిషి ఎంతకైనా తెగిస్తాడు. న్యాయ అన్యాయాలను పట్టించుకోడు. సెల్ఫీ తీసుకుంటుండగా ఫోన్ రిజర్వాయర్ లో జారవిడుచుకున్న ఓ ప్రభుత్వ అధికారి ఇదే పని చేశాడు. తన స్వార్థం కోసం ఏకంగా ఆ రిజర్వాయర్లే ఖాళీ చేయించాడు. 21 లక్షల నీటిని తోడి పారేసి వందలాది మంది రైతుల ఉసురు పోసుకున్నాడు.
చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఓ వింత ఘటన ఇది. కోయలిబెడ బ్లాక్ కు చెందిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రాజేష్ విశ్వాస్ కంకేర్ జిల్లాలోని ఖేర్ కట్టా రిజర్వాయర్ కు తన మిత్రులతో కలిసి పిక్నిక్ వెళ్లాడు. ఈ మ్రంలో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే చేయి జారీ తన మొబైల్ రిజర్వాయర్‌లో పడిపోయింది. సామ్ సంగ్ ఎస్ 23 పేరు గల ఈ మొబైల్ ధర రూ.96000. దీంతో అందులో ముఖ్యమైన డేటా ఉందంటూ గజ ఈతగాళ్లతో వెతికించాడు.
అయినా ఫలితం లేకపోవడంతో రాజేష్ నీటిపారుదల శాఖ కార్యాలయానికి వెళ్లాడు. డ్యాంలో మునిగిన తన ఫోన్ ని ఎలాగైనా వెలికితీయాలని వారితో చర్చించాడు. చివరికి రిజర్వాయర్ నుంచి నీరు బయటకి తోడేయ్యాలని నిర్ణయించుకున్నాడు. 30 హార్స్ పవర్ డీజిల్ పంపులతో వరుసగా మూడు రోజుల పాట 15 అడుగుల నీటిని తోడించాడు. సుమారు 21 లక్షల లీటర్ల నీటిని తోడగా మూడు రోజులకు ఫోన్ దొరికింది.
అయితే ఎంత ప్రయత్నించినా ఫోన్ ఆన్ కాలేదు. ఈ అధికారి చేసిన దుర్మార్గపు పనికి రైతులకు సాగునీరు లేకుండా పోయింది. పంపుల ద్వారా నీటిని తోడేయడంపై తీవ్ర స్థాయిలో రైతుల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ విషయమై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు అందింది. నీటిని తోడేందుకు తాము ఎలాంటి అనుమతీ నీటిపారుదల శాఖ అధికారులు కలెక్టర్ కు వివరించారు. దీంతో మే,22 నుండి 25 వరకు పంపుల ద్వారా 21 లక్షల నీటిని తోడేసిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రాజేష్ విశ్వాస్‌ను విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కంకేర్ ఉత్తర్వులు జారీ చేశారు.