Begin typing your search above and press return to search.
వచ్చేసింది వన్డే వరల్డ్ కప్ లోగో.. స్పెషాలిటీ తెలుసా?
By: Tupaki Desk | 3 April 2023 1:24 PM GMTఈ ఏడాది అక్టోబరు – నవంబరులో వన్డే ప్రపంచ కప్ జరగనుంది. నాలుగేళ్ల కు ఓసారి జరిగే ప్రపంచ కప్ కావడంతో చాలా ఉత్సుకత ఉంటుంది. అందులోనూ టెస్టు చాంపియన్ షిప్, టి20 ప్రపంచ కప్ ఉన్నప్పటికీ వన్డే ప్రపంచ కప్ విజేతనే అసలు సిసలు చాంపియన్ అని అంటారు. దశాబ్దాలుగా అది అలా సంప్రదాయంగా అప్రకటితంగా వస్తోంది. మరోవైపు టి20 కప్ కు విశేష ఆదరణ ఉన్నా.. దానినోపెద్ద లీగ్ తరహాలో చూసి ఎంజాయ్ చేస్తుంటారు తప్ప.. విజేతను చాంపియన్ పదానికి ప్రామాణికంగా తీసుకోరు. అందులోనూ టి20లంటే క్షణాల్లో ఫలితం మారే మ్యాచ్ లు. ఈ కారణంగానూ టి20 ప్రపంచ కప్ విజేతలను ప్రపంచ చాంపియన్ లుగా పరిగణించరు.
సిసలైన చాంప్ నకు ప్రామాణికం
ఇక వన్డే ప్రపంచ కప్ విషయానికి వస్తే అసలైన చాంపియన్ ఈ కప్ ద్వారానే వస్తుంది. 1975లో ప్రపంచ కప్ నిర్వహణ మొదలైంది. 1979, 1983,1987-88, 1991-92, 1995-96, 1999, 2003, 2007, 2011, 2015, 2019లలో కప్ లు జరిగాయి. 12వ ప్రపంచ కప్ భారత్ లో జరగనుంది. ఈసారి మన దేశమే పూర్తిగా నిర్వహిస్తోంది. 1987-88లో పాకిస్థాన్ తో కలిపి తొలిసారి, 1996లో పాక్-శ్రీలంకలతో, 2011లో బంగ్లాదేశ్, శ్రీలంకతో కలిపి నిర్వహించింది. ఈ ఏడాది కప్ నకు సొంతంగా ఆతిథ్యం ఇవ్వనుంది. డిఫెండింగ్ చాంపియన్ గా ఇంగ్లండ్ బరిలో దిగుతోంది.
12 ఏళ్ల తర్వాత
2011లో సొంతగడ్డ పై జరిగిన వన్డే ప్రపంచ కప్ లో భారత్ విజేగతా నిలిచింది. 2015, 2019లో మన జట్టు సెమీస్ వరకు చేరగలిగింది. చిత్రమేమంటే.. 2015లో ఆతిథ్య జట్టయిన ఆస్ట్రేలియా, 2019లో ఇంగ్లండ్ కప్ లను ఎగరేసుకుపోయాయి. 2011లోనూ ఇదే తరహాలో భారత్ కప్ ను వశం చేసుకుంది. అంటే మూడు దఫాలుగా ఆతిథ్య దేశాలే కప్ ను గెలుస్తున్నయి. ఈ లెక్కన మన జట్టు వచ్చే కప్ ను సొంతం చేసుకుంటుందని అభిమానులుగా సంతోషపడదాం.
ఆ సందర్భంగా లోగో ఆవిష్కరణ..
2011 ఏప్రిల్ 2.. భారత్ ప్రపంచ కప్ గెలిచిన రెండో సందర్భం. నాడు ధోనీ మిడాన్ మీదుగా కొట్టిన సిక్స్ మన ఖాతాలో 28 ఏళ్ల తర్వాత "ప్రపంచ కప్ విజేత" హోదాను అందించింది. సరిగ్గా ఈ రోజును పురస్కరించుకుని.. ఆదివారం 2023 ప్రపంచ కప్ లోగోను ఆవిష్కరించారు. నీలం, గులాబీ రంగు డిజైను మధ్య ప్రపంచ కప్ తో ఈ లోగో ఆకర్షణీయంగా ఉంది. మధ్యలో ఉన్న పది చుక్కలు (డాట్స్) పది జట్లకు సంకేతంగా నిలిచాయి. ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ అని
రాసి ఉంది. ఈ పది జట్లలో 8 నేరుగా అర్హత సాధించగా.. రెండు క్వాలిఫయింగ్ ద్వారా రానున్నాయి. 2011, 2015 ప్రపంచ కప్ లలో 14 జట్లు పాల్గొనగా.. పోటీ మరీ ఇబ్బందిగా ఉందని 2019 నుంచి జట్ల సంఖ్యను 10కి కుదించారు. ఇక.. "2023 వన్డే ప్రపంచ కప్ నకు ఆరు నెలల సమయం మాత్రమే ఉంది. సొంత గడ్డపై ప్రపంచ కప్ ఆడడం ప్రతి జట్టు కల. ఈ టోర్నీ ఎప్పుడు మొదలవుతుందా అనే ఉత్సాహంతో ఉన్నా. పూర్తి సామర్థ్యంతో ఆడితే ట్రోఫీని గెలిచే అవకాశం ఉంది" అని టీమిండియా సారథి రోహిత్ శర్మ అన్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.