Begin typing your search above and press return to search.
భార్య రాలేదని.. భర్త చేత 'సర్పంచ్'గా ప్రమాణం.. ఇదెక్కడి సిత్రమంటే?
By: Tupaki Desk | 4 April 2021 7:30 AM GMTకలలో కూడా ఊహించలేని ఉదంతం తాజాగా చోటు చేసుకుంది. సర్పంచ్ గా ప్రమాణస్వీకారం చేయాల్సిన ఆమె రాకపోవటంతో.. ఆమె భర్త చేత ప్రమాణస్వీకారాన్ని పూర్తి చేసిన అధికారుల తీరు షాకింగ్ గా మారింది. ఇంతకీ ఈ ఉదంతం ఎక్కడ చోటు చేసుకుందన్న ప్రశ్న వేస్తే.. చాలామంది ఏ బిహారో.. ఉత్తరప్రదేశో చెబుతారు. కానీ.. ఈ సిత్రానికి వేదికైంది ఏపీలోని కర్నూలు జిల్లా. ఇంతకూ ఏం జరిగిందంటే..
కర్నూలు జిల్లా కౌతాళం మండలంలో చూడి గ్రామంలో ప్రమాణస్వీకారం జరుగుతోంది. ప్రమాణ స్వీకారానికి ఎన్నికల్లో సర్పంచ్ గా గెలిచిన లక్ష్మీ హాజరు కావాల్సి ఉంది. అయితే.. ఆమె అనారోగ్యానికి పాల్పడటంతో.. ప్రమాణస్వీకారోత్సవానికి రాలేని పరిస్థితి. దీంతో.. అధికారులు అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆమె భర్త ఉప్లప్పతో ప్రమాణస్వీకారం చేయించారు.
మామూలుగా అయితే.. అక్కడెక్కడో మారుమూలన జరిగిన ఈ సిత్రం.. ఆ కార్యక్రమానికి హాజరైన వారు ఫోన్లలో ఫోటోలు తీయటం.. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో.. సీరియస్ అయిన ఉన్నతాధికారులు సంబంధిత పంచాయితీ కార్యదర్శికి నోటీసులు జారీ చేశారు. అంతేకాదు.. అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత సర్పంచ్ గా లక్ష్మీ చేత మళ్లీ ప్రమాణస్వీకారం చేయిస్తానని పేర్కొన్నారు. అయినా.. సర్పంచ్ గా ప్రమాణస్వీకారం చేయటానికి రాకుంటే.. ఆమె భర్త చేత ప్రమాణస్వీకారం చేయిస్తారా? అంటూ అధికారుల తెలివికి షాక్ తింటున్న పరిస్థితి.