Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ తీసుకోని కుప్పకూలిన హెడ్ నర్సు .. సమర్థతపై సందేహాలు !

By:  Tupaki Desk   |   19 Dec 2020 10:05 AM GMT
వ్యాక్సిన్ తీసుకోని కుప్పకూలిన హెడ్ నర్సు .. సమర్థతపై సందేహాలు !
X
కరోనా వైరస్ విజృంభణ ఇంకా పూర్తిగా తగ్గిపోలేదు. ఈ మహమ్మారి ప్రభావం పూర్తిగా తగ్గిపోవాలంటే , వ్యాక్సిన్ రావాల్సిందే. అయితే , ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుండటం తో ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ఫైజర్-బయోఎన్ ‌టెక్, మెడర్నా వ్యాక్సిన్లకు రెగ్యులేటరీ అనుమతి లభించింది. అయితే క్లినికల్ ట్రయల్స్ నుండి సేకరించిన భద్రతా డేటాను విశ్లేషించిన తరువాత మాత్రమే వ్యాక్సిన్లకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించినప్పటికీ టీకాల భద్రత సమర్ధతపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ముఖ్యంగా టెనస్సీలోని ఫైజర్, బయోఎన్‌ టెక్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న హెడ్ నర్సు టిఫనీ డోవర్ ప్రెస్ ప్రశ్నలకు సమాధానాలిస్తూ ఒక్కసారిగా అస్వస్థతకు గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది . దీంతో వ్యాక్సిన్‌ భద్రత, సమర్థతపై తీవ్రమైన సందేహాలను రేకెత్తించింది. టేనస్సీలోని సీహెచ్‌ఐ మెమోరియల్ హాస్పిటల్ ఎన్ చత్తనూగలో విలేకరుల సమావేశంలో టిఫనీ డోవర్ మాట్లాడుతూ, టీకా తీసుకోవడం సంతోషిస్తున్నానని ప్రకటించారు. తర్వాత విలేకరుల సమావేశంలోనే మూర్ఛపోవడం కలకలం రేపింది. ఈ దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. క్షమించండి, మైకం కమ్ముతోందంటూ ఆమె మూర్ఛపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు వైరల్‌ గామారింది.