Begin typing your search above and press return to search.
ఒక నెలలో ఏఐ పొట్టన పెట్టుకున్న ఉద్యోగాల లెక్క బయటకొచ్చింది
By: Tupaki Desk | 4 Jun 2023 7:05 PM GMTఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో టెక్ ఉద్యోగాల్లో దారుణ పరిస్థితులు చోటు చేసుకుంటాయన్న అంచనాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నా..దాని ప్రభావం ఎంత ఉంటుందన్న విషయాన్ని చెప్పే సరైన ఆధారం ఇప్పటివరకు రాలేదనే చెప్పాలి. తాజాగా ఆ కొరతను తీరస్తూ.. ఒక నివేదిక వెల్లడైంది. ఏఐ కారణంగా భారీ ఎత్తున ఉద్యోగాలకు కోత పడుతుందన్న భయాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఈ లెక్క ఉండటం గమనార్హం. తాజా నివేదిక వివరాలు చూసిన వారు.. ఉద్యోగ పర్వంలో కృత్రిమ మేధ విధ్వంసం మొదలైనట్లుగా చెబుతున్నారు.
అమెరికా కేంద్రంగా ప్లేస్ మెంట్.. ట్రాన్స్ లేషన్ కార్యకలాపాలు నిర్వహించే ఛాలెంజర్ , గ్రే అండ్ క్రిస్మస్ సంస్థ ఒక రిపోర్టును వెలువరించింది. దీని ప్రకారం గత నెల (మే)లో 80 వేల మంది ఉద్యోగాలు కోల్పోగా వారిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన సంఖ్య 4 వేల వరకు ఉంటుందన్న విషయాన్ని పేర్కొంది. ఖర్చుల్లో కోత.. మాంద్యం పరిస్థితుల కారణంగా ఉద్యోగాలు కోల్పోయినట్లుగా చెబుతున్నారు.
ఈ ఏడాది జనవరి నుంచి మే చివరి నాటికి ఆమెరికలో 4 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లుగా నివేదిక స్పష్టం చేసింది. పలు అమెరికన్ కంపెనీలు మనుషులు చేసే ఉద్యోగాల్లో చాట్ జీపీటీని వాడటం ప్రారంభించినట్లుగా నివేదిక పేర్కొంది. టెక్ ప్రపంచంలో ఎంతో కష్టమైన పనుల్ని ఏఐ టూల్స్ అవలీలగా చేస్తూ మనుషుల స్థానాన్ని భర్తీ చేస్తున్నట్లుగా చెబుతున్నమాటలకు తాజా నివేదిక నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని చెప్పాలి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉందంటే.. ఏఐ కారణంగా రానున్నరోజుల్లో టెక్ ఉద్యోగాలు ఎంత భారీగా నష్టపోతాయన్నది ఇప్పుడు అంచనాలకు అందని రీతిలో మారిందన్న మాట వినిపిస్తోంది.