Begin typing your search above and press return to search.
ఈ జైలంటే ఖైదీలు పడిచస్తున్నారట!
By: Tupaki Desk | 12 Jun 2017 8:55 AM GMTమన దేశంలో జైళ్ల పరిస్థితి ఎలా ఉంటుంది? చుట్టూ ఎత్తైన గోడలు.. పైన కరెంట్ ఫెన్సింగ్.. కట్టుదిట్టమైన భద్రత.. ఖైదీలను గుర్తుపట్టేందుకు తెల్ల డ్రెస్సు. అచ్చు ఇలాగే కదా? మనదేశంలో అనే కాదు.. ప్రపంచంలోని మెజార్టీ దేశాల్లో జైళ్లన్ని ఇలానే ఉంటాయి. సెంట్రల్ జైళ్ల నుంచి మొదలు కొని.. జిల్లా కేంద్రంలో ఉండే జైళ్ల వరకూ అన్నింటిలో సేమ్ సీన్. కానీ ఓ ప్రముఖ దేశంలో మాత్రం దీనికి భిన్నం. ఆ జైలు వైపు ఖైదీలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారట. అలా అని ఆ జైలుకు వచ్చేందుకు నేరాలు చేస్తున్నారని కాదు. దురదృష్టవశాత్తు జైలుకు వెళ్లే పరిస్థితి వస్తే తమకు ఆ జైలులో ఇవ్వాలనే రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా గుర్తింపు పొందిన నార్వేలో పరిస్థితి.
నార్వేలో అన్ని దేశాల జైళ్ల కంటే విభిన్నమైన వాతావరణం ఉంది. వారి మాటలో చెప్పాలంటే.. జైలంటే ఓ టూరిస్టు స్పాట్. జైలు శిక్ష.. హాలిడే ట్రిప్పులాంటింది. ఎటు చూసినా పచ్చని పొలాలు.. కలపతో చేసిన కాటేజీలు.. ఏసీలు.. బోర్ కొడితే చూసేందుకు టీవీలు. సరదా కోసం సినిమాలే కాదు.. గుర్రపు స్వారీలు కూడా చెయ్యొచ్చు. అంతేకాదు.. మనకు నచ్చిన ఆహారాన్ని మనమే వండుకొని తినొచ్చు. అందుకు ఏ వస్తువైనా దొరికే సూపర్ మార్కెట్లు కూడా జైళ్లోనే ఉంటాయన్నమాట.వస్తువులను కొనడానికి డబ్బుల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖైదీలకు అలవెన్స్ కింద నెలకు 90 డాలర్లు చెల్లిస్తుంది అక్కడి ప్రభుత్వం. వ్యవసాయం - గుర్రాలకు కాపలా - కలపతో వస్తువులు తయారు చేయడం, ఐలాండ్ నిర్వహణలో సహాయపడటం ఇలా ఖైదీలు వారికి నచ్చిన పనిని ఎంపిక చేసుకొని విధులు నిర్వర్తించుకోవచ్చు. అందుకుగానూ వారికి రోజుకూ 8 డాలర్లు వేతనం ఇస్తుంది. ఖైదీలు చదువుకోవాలనుకుంటే.. స్థానికంగా ఉన్న స్కూల్ - లైబ్రరీలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. అంతేకాదు.. కుటుంబసభ్యులతో మాట్లాడుకోవడానికి కొన్ని టెలిఫోన్ బూత్ లు కూడా అందుబాటులో ఉన్నాయి.
1898లో బస్టొయ్ ఐలాండ్ ను కొనుగోలు చేసిన నార్వే ప్రభుత్వం.. దానిని పలు రకాలుగా వినియోగించుకొని 1982లో జైలుగా మార్చేసింది. 2.6 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ జైలులో కేవలం 69 మంది పోలీసులు మాత్రమే ఉంటారు. రాత్రిపూట కేవలం ఐదారుగురు మాత్రమే గస్తీ కాస్తారు. అయినా.. ఒక్క ఖైదీ కూడా పారిపోయిన ఘటనలు లేవు. అందుకే అతి తక్కువ భద్రతా సిబ్బంది ఉన్న జైలుగా దీనికి పేరుంది. ప్రపంచంలోనే అతి తక్కువ నేరాలు నమోదయ్యే దేశాల్లో నార్వే ఒకటి. లంచం - అవినీతి రహిత దేశాల లిస్టులో ఎప్పుడు టాప్ టెన్ లో ఉంటుంది ఈ దేశం. మానవతా విలువలు కలిగిన జైళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. అంతే కాదు.. ఇక్కడ ఉరి, జీవితకాలపు కారాగార శిక్షలు ఉండవు. మనిషిలో మార్పు తీసుకురావడమే తప్ప వారిని శిక్షించడం జైళ్ల ఉద్దేశం కాదన్నది నార్వే సిద్ధాంతం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/