Begin typing your search above and press return to search.
16 గంటల సుదీర్ఘ ప్రయాణం.. కానీ ఎక్కిన చోటుకే తిరిగి..!
By: Tupaki Desk | 18 Feb 2023 7:00 AM GMTవిదేశాలకు విమానాల్లో వెళ్లాలంటే ఎంతో తతంగం ఉంటుంది. ప్రయాణికులు ముందస్తుగానే టికెట్లు బుక్ చేసుకుని షెడ్యూల్ ప్రకారంగా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. అయితే న్యూజిల్యాండ్ ప్రయాణీకులకు తరుచూ ఇటీవల ఓ సంఘటన రిపీట్ అవుతుంది. విదేశాల నుంచి అక్లాండ్ ఎయిర్ పోర్టుకు వెళ్లే విమానాలు మధ్యలో తిరిగి వెనక్కి వచ్చేస్తున్నారు. దీంతో విమాన ప్రయాణికులు న్యూజిలాండ్ పేరు చెబితేనే బెంబేలెత్తిపోతున్నారు.
ఇటీవల దుబాయ్ నుంచి న్యూజిల్యాండ్ కు వెళ్లాల్సిన ఈకే 448 ఎమిరేట్స్ విమానం 13 గంటలపాటు గగనతలంలో ప్రయాణించి మధ్యలో వెనక్కి వచ్చింది. అక్లాండ్ లో వరదల కారణంగా ఎయిర్ పోర్టు మూసివేయడంతో ఈ ఘటన జరిగింది. దీంతో ఆ విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీంతో అక్లాండ్ ఎయిర్ పోర్టు అధికారులు ప్రయాణికులు నాడు క్షమాపణలు చెప్పారు.
తాజాగా ఎయిర్ న్యూజిల్యాండ్ విమాన ప్రయాణీకులకు సైతం ఇదే సంఘటన ఎదురైంది. గురువారం సాయంత్రం అక్లాండ్ నుంచి ఎయిర్ న్యూజిలాండ్ న్యూయార్క్ కు బయలుదేరింది. సుమారు 8 గంటల పాటు ప్రయాణించిన అనంతరం మధ్యలో విమానంలో తిరిగి వెనక్కి వచ్చింది. న్యూయార్క్ లోని జాన్ ఎఫ్ కెన్నెడీ విమానాశ్రయంలో విద్యుద్ఘాతం జరగడంతో ఎయిర్ పోర్టు నుంచి ల్యాండ్ కావడానికి అనుమతి లభించలేదు. దీంతో ఎయిర్ న్యూజిల్యాండ్ తిరుగు ప్రయాణమై తిరిగి అక్లాండ్ కు చేరుకుంది.
ఈ విషయాన్ని ముందుగానే సిబ్బంది ప్యాసింజర్స్ కు తెలిపారు. ఈ ఒక్క విమానమే కాకుండా సియోల్.. రోమ్.. మిలాన్ నుంచి వెళ్లిన విమానాలు సైతం తిరిగి అమెరికాలోని ఇతర విమానాశ్రయాల్లో ల్యాండయ్యాయి. ఈ ఘటనపై పలువురు ప్రయాణికులు స్పందిస్తూ ‘నవ్వాల్లో.. ఏడవాలో అర్థం కావడం లేదని’ వాపోయారు. దాదాపు 16 గంటల పాటు సుదీర్ఘంగా ప్రయాణించి తిరిగి ఎక్కిన చోట దిగడంతో చేసేదేమీ లేక అంతా ఇంటి ముఖం పట్టారు.
ఇటువంటి ఘటన ఇటీవల ఈకే 448 ఎమిరేట్స్ విమానం ప్రయాణీకులకు సైతం ఎదురైంది. ఇందులోని ప్రయాణికులు దాదాపు 13 గంటలు ప్రయాణించి ఎక్కడి చోటికి తిరిగి వచ్చారు. కాగా వీరి రికార్డును బ్రేక్ రికార్డు చేస్తూ న్యూజిల్యాండ్ ప్రయాణికులు 16 గంటలపాటు సుదీర్ఘ దూరం ప్రయాణించి ఎక్కడి చోటే దిగడం గమనార్హం. అయితే ఇటువంటి ఘటనలు ఇటీవల తరుచూ జరుగుతుండటంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి లోనవుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.