Begin typing your search above and press return to search.

ఆ టీవీ నటిది సూసైడా?

By:  Tupaki Desk   |   2 March 2016 10:11 AM IST
ఆ టీవీ నటిది సూసైడా?
X
గ్లామర్ ప్రపంచానికి చెందిన మరో టీవీ నటి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. కన్నడ టీవీ ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి శ్రుతి (24) అనుమానాస్పద రీతిలో మరణించటం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. చిన్న వయసులోనే పెళ్లి.. ఆరేళ్ల కొడుకున్న ఆమె.. ఇంటికి సమీపంలోని స్నేహితుడి గదిలో ఆత్మహత్య చేసుకోవటం హాట్ టాపిక్ గా మారింది. ఏడేళ్ల క్రితం రమేశ్ అనే వ్యక్తిగా ఆమెకు వివాహం జరిగింది. బెంగళూరు మహానగరంలోని మాదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

హరోహళ్లిలో శ్రుతి నివాసం ఉంది. దానికి దగ్గర్లోనే శ్రీకాంత్ అనే వ్యక్తితో శ్రుతి సన్నిహితంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. సోమవారం రాత్రి శ్రుతి స్నేహితుడి ఇంటికి వెళ్లిందని.. ఆ సమయంలో వారిద్దరి మధ్య వాదులాట జరిగినట్లుగా చెబుతున్నారు. ఇరువురి మధ్య గొడవ జరిగిన తర్వాత.. ఇంట్లోని గదిలోకి వెళ్లి తలుపేసుకుందని.. అనుమానం వచ్చి తెరవాలని చూస్తే.. తెరుచుకోకపోవటంతో.. స్నేహితుల సాయంతో తలుపును తెరవగా.. అందులో శ్రుతి ఉరి వేసుకొని ఉండటం కనిపించింది. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అనుమానాస్పద మరణంగా పోలీసులు కేసు రిజిష్టర్ చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఉదంతానికి సంబంధించి మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది.