Begin typing your search above and press return to search.

ఇడ్లీ తినలేదని చిన్నారిని చంపేసిన పెద్దమ్మ!

By:  Tupaki Desk   |   10 Sept 2020 12:15 PM IST
ఇడ్లీ తినలేదని చిన్నారిని చంపేసిన పెద్దమ్మ!
X
కొన్ని కొన్ని సంఘటలు చూస్తుంటే అసలు ఇలాంటి సమాజంలోనా మనం జీవించేది అని అనిపించకమానదు. ఎందుకంటే ..ఈ సమాజంలో జరిగే దుర్ఘటనలు అలాంటివి. అసలు మానవ సంబంధాలు ఉన్నాయా ? లేవా ? అనిపిస్తుంది. తాజాగా ఇడ్లీ తినలేదని ఐదేళ్ల చిన్నారిని హతమార్చింది ఓ పెద్దమ్మ. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచ్చి జిల్లా త్యాగదుర్గం సమీపం మెల్‌విళి గ్రామంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే .. మెల్‌విళి గ్రామానికి చెందిన రోసారియో, జయరాణి దంపతులకి రెన్సీమేరీ అనే ఐదేళ్ల కూతురు ఉంది. మూడేళ్ల క్రితం జయరాణి మృతిచెందడంతో రోసారియో మరో మహిళను వివాహం చేసుకొని వేరు కాపురం పెట్టాడు. అప్పటినుండి ఆ చిన్నారి తన అమ్మమ్మ న జయరాణి తల్లి పచ్చయమ్మాళ్‌ ఇంట్లో ఉంటోంది. అక్కడే జయరాణి అక్క ఆరోగ్యమేరీ కూడా ఉంటుంది. ఆరోగ్యమేరీకి ఇంకా పెళ్లి కాలేదు. ఈ క్రమంలో సోమవారం ఉదయం రెన్సీమేరీని ఇడ్లీ తినమని ఆరోగ్యమేరీ కోరగా, అవి బాగా లేవని, నాకు వద్దంటూ బాలిక బయటకు వెళ్లి స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్లింది.

దీనితో ఆగ్రహించిన ఆరోగ్యమేరీ స్నేహితులతో ఆడుకుంటున్న రెన్సీమేరీని చావబాదుతూ ఇంట్లోకి తీసుకొచ్చి, తలుపులు మూసి కర్రతో తీవ్రంగా కొట్టిందని స్థానికులు చెప్పారు . ఆ చిన్నారి కేకలు విన్న చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకొని రెన్సీమేరీని రక్షించి త్యాగదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆ హాస్పిటల్ లో ప్రథమ చికిత్స చేసిన తర్వాత , బాలికను కళ్లకురిచ్చి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, అప్పటికే బాలిక మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై త్యాగదుర్గం పోలీసులు కేసు నమోదుచేసి ఆరోగ్యమేరీని అరెస్టు చేసి జైలుకు తరలించారు.